అత్యవసర చికిత్సకు సీఎంఆర్‌ఎఫ్‌ మంజూరు | - | Sakshi
Sakshi News home page

అత్యవసర చికిత్సకు సీఎంఆర్‌ఎఫ్‌ మంజూరు

Mar 8 2026 7:26 AM | Updated on Mar 8 2026 7:26 AM

ఖమ్మంమయూరిసెంటర్‌: ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి ప్రత్యేక చొరవతో ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్‌) ద్వారా కారేపల్లి మండలం మాధారం గ్రామానికి చెందిన గుంపెనపల్లి విజయలక్ష్మికి రూ.2.50 లక్షల విలువ చేసే ఎల్‌ఓసీ (లెటర్‌ ఆఫ్‌ క్రెడిట్‌) మంజూరైంది. తీవ్రమైన కీళ్ల నొప్పులతో బాధపడుతున్న బాధితురాలు ఇటీవల ఎంపీ రఘురాంరెడ్డిని కలిసి.. తన బాధను వ్యక్తపర్చగా.. ఎంపీ రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసు చేశారు. దీంతో నిమ్స్‌లో మెరుగైన చికిత్స అందించేందుకు రూ.2.50 లక్షలను కేటాయించగా.. మంజూరు పత్రాన్ని బాధితురాలి కుటుంబ సభ్యులకు ఎంపీ రఘురాంరెడ్డి శనివారం హైదరాబాద్‌లోని తన నివాసంలో అందజేశారు.

మెకానిక్‌ కుటుంబానికి ఆర్థిక సాయం

ఖమ్మంఅర్బన్‌: ఖమ్మం కార్పొరేషన్‌ పరిధిలోని ప్రకాష్‌నగర్‌కు చెందిన టూవీలర్‌ మెకానిక్‌ మారెళ్ల రాజు గతేడాది నవంబర్‌ 9న అనారోగ్యంతో మృతి చెందాడు. ఆయనకు భార్య నవ్య, ఏడాది వయసున్న పాప శ్రావణి ఉంది. దీంతో మిగతా మెకానిక్‌కు అంతా కలిసి టూవీలర్‌ మెకానిక్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో రూ.1.40 లక్షలను సమీకరించి, ఎల్‌ఐసీలో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేశారు. బాండ్‌ను శనివారం త్రీటౌన్‌ సీఐ మోహన్‌బాబు చేతుల మీదుగా మృతుడి భార్య నవ్యకు అందజేశారు. కార్యక్రమంలో నాగేశ్వరరావు, లాలయ్య, చాంద్‌, సత్యం, అబ్బాస్‌, నాగరాజ్‌, వెంకటేశ్‌, నరేశ్‌, వీరేశ్‌, శ్రీకాంత్‌, శ్రీను, కరుణాకర్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement