
ఇండియన్ ఆయిల్ మార్కెటింగ్ డైరెక్టర్‌గా.. సౌమిత్ర పి శ్రీవాస్తవ (Saumitra P Srivastava) బాధ్యతలు స్వీకరించారు. కంపెనీలో సుమారు 30ఏళ్లకు పైగా అనుభవం ఉన్న ఈయన.. ఐఐటీ రూర్కెలా నుంచి సివిల్ ఇంజినీరింగ్, ముంబైలోని ఎస్‌పీ జైన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ రీసెర్చ్ నుంచి ఎంబీఏ పట్టా పొందారు.
ఎల్‌పీజీ వ్యాపార విభాగంలో నాలుగేళ్ల పనిచేశారు. ఆ తరువాత ఇండియన్ ఆయిల్ సంస్థలో చేరిన.. సౌమిత్ర పి శ్రీవాస్తవ సేల్స్ విభాగంలో పలు కీలక బాధ్యతలు నిర్వహించారు. ఆ సమయంలో వ్యాపార విస్తరణకు కీలకంగా మారారు. ఈయనకు ముంబై, ఢిల్లీ డివిజన్ కార్యాలయాలను నడిపిన అనుభవం కూడా ఉంది. అంతే కాకుండా ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ ప్రాంతాల్లో కూడా సేల్స్ విభాగంలో పనిచేశారు. మహారాష్ట్ర, గోవా హెడ్ ఆఫ్ స్టేట్‌గా పనిచేసిన సమయంలో.. ప్రధాన ఉత్పత్తులు, వ్యాపారాలను ఈయన విజయవంతంగా నిర్వహించారు.