అలా జరిగితే దేవుళ్లను కూడా ‍అరెస్ట్‌ చేస్తారా?.. అల్లు అ‍ర్జున్ అరెస్ట్‌పై ఆర్జీవీ రియాక్షన్ | Director Ram Gopal Varma Questioned Officials On Allu Arjun Arrest | Sakshi
Sakshi News home page

Ram Gopal Varma: ఉత్సవాల్లో భక్తులు చనిపోతే దేవుళ్లను ‍అరెస్ట్‌ చేస్తారా?.. ఆర్జీవీ సూటి ప్రశ్న

Dec 13 2024 7:25 PM | Updated on Dec 13 2024 7:39 PM

Director Ram Gopal Varma Questioned Officials On Allu Arjun Arrest

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ అరెస్ట్‌పై టాలీవుడ్ సంచలన డైరెక్టర్ రాం గోపాల్ వర్మ ట్వీట్ చేశారు. సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనలో బన్నీని అరెస్ట్ చేయడంపై ఆయన స్పందించారు. ఈ సందర్భంగా పోలీసులు, అధికారులకు తనదైన శైలిలో ప్రశ్నలు సంధించారు. నాలుగు రకాల ప్రశ్నలతో ఆయన ట్వీట్ చేశారు.

సంధ్య థియేటర్‌ కేసులో అల్లు అర్జున్‌ను అరెస్ట్‌ చేసిన అధికారులకు ఆర్జీవీ వేసిన ప్రశ్నలు నెట్టింట వైరల్‌గా మారాయి. అవేంటో మీరు కూడా చూసేయండి. పుష్కరాలు ,బ్రహ్మోత్సవాలు లాంటి  ఉత్సవాల్లో  తోపులాటలో  భక్తులు  పోతే  దేవుళ్ళని  అరెస్ట్  చేస్తారా ? అంటూ ప్రశ్నించారు. అలాగే ఎన్నికల  ప్రచారాల  తొక్కిసలాటలలో  ఎవరైనా పోతే  రాజకీయ  నాయకులని  అరెస్ట్  చేస్తారా ? అని ట్విటర్ వేదిక నిలదీశారు.

ఆర్జీవీ నాలుగు ప్రశ్నలు ఇవే..

1.పుష్కరాలు , బ్రహ్మోత్సవాల్లాంటి  ఉత్సవాల  తోపులాటలో  భక్తులు  పోతే  దేవుళ్ళని  అరెస్ట్  చేస్తారా ?

2.ఎన్నికల  ప్రచారాల  తొక్కిసలాటలలో  ఎవరైనా పోతే  రాజకీయ  నాయకులని  అరెస్ట్  చేస్తారా ?

3. ప్రీ రిలీజ్  ఫంక్షన్స్  లో ఎవరైనా పోతే  హీరో , హీరోయిన్లని  అరెస్ట్  చేస్తారా ?

4. భద్రత  ఏర్పాట్లు  పోలీసులు  ఆర్గనైజర్లు  తప్ప  ఫిలిం  హీరోలు ,ప్రజా  నాయకులూ  ఎలా  కంట్రోల్  చెయ్యగలరు ?

 

Advertisement
 
Advertisement
Advertisement