
హీరో నాని తన సోదరి దీప్తికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. అయితే, తమ చిన్ననాటి ఫోటోను షేర్ చేసి అభిమానులతో పంచుకున్నారు. ఈ ఏడాదిలో తమ సొంత ఫ్రాంచైజీలో భాగమై ‘హిట్ 3’లో నాని నటించారు. ఆపై కోర్టు సినిమాను సొంత బ్యానర్‌లోనే తెరకెక్కించి భారీ హిట్ అందుకున్నారు. అయితే, ఈ విజయాల్లో నాని సోదరి దీప్తి పాత్ర చాలా ఎక్కువగానే ఉందని చెప్పవచ్చు. ఆమె సహ నిర్మాతగా కూడా కోర్టు సినిమాకు ఉన్నారు.

నాని సోదరి దీప్తి గంటా ఒక డైరెక్టర్ కూడా.. గతంలో ‘మీట్ క్యూట్’ అనే చిత్రాన్ని ఆమె తెరకెక్కించారు. వాల్ పోస్టర్ సినిమా పతాకంపై నాని సమర్పిస్తుండగా ప్రశాంతి నిర్మించారు. గతంలోనూ 'అనగనగా ఒక నాన్న' అనే షార్ట్‌ఫిలిం కోసం ఆమె దర్శకత్వం వహించిన దీప్తి తన ప్రతిభ చూపారు. అలా సినిమాతో ఆమెకు మంచి కనెక్షన్ ఉంది. అ!, హిట్ ఫ్రాంచైజీ చిత్రాలు, కోర్టు వంటి సినిమాలకు దీప్తి పనిచేశారు. అలా తన అక్కతో నాని చిత్ర పరిశ్రమలో సూపర్‌గా విజయాలు అందుకుంటున్నారు. ఈరోజు ఆమె పుట్టినరోజు కావడంతో ఇలా ఫోటో షేర్ చేశారు. 'అక్కీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈ వేడుకలు జరుపుకోవడానికి నేను వేచి ఉండలేను.' అంటూ తెలిపాడు.
హీరో నాని ఫ్యామిలీ మ్యాన్‌గా ఇండస్ట్రీలో గుర్తింపు ఉంది. సినిమాకు ఎంత ప్రాముఖ్యత ఇస్తాడో తన కుటుంబానికి కూడా అంతే సమయం కేటాయిస్తాడు. ఇప్పుడు సినిమాపై తనకున్న మక్కువతో సొంత బ్యానర్‌ను ఏర్పాటు చేసి కొత్తవారికి ఛాన్సులు కల్పిస్తున్నాడు. వాస్తవానికి చిత్రపరిశ్రమకు నాని చాలామంది దర్శకులను పరిచయం చేశారు. వారితో విజయాలను కూడా అందుకున్నారు.