
టాలీవుడ్ సంచలన డైరెక్టర్ రాం గోపాల్ వర్మ హైదరాబాద్‌లోని ప్రసాద్ ఐ మ్యాక్స్ వద్ద సందడి చేశారు. హాలీవుడ్ మూవీని థియేటర్లో వీక్షించేందుకు ఆయన వచ్చారు. ఈ సందర్భంగా సినిమాను చూసి బయటకు వచ్చిన ఆర్జీవీని మీడియా ప్రతినిధులు చుట్టుముట్టారు. సినిమా ఎలా ఉందని అడగడంతో సూపర్‌గా ఉందంటూ రాం గోపాల్ వర్మ ప్రశంసలు కురిపించారు. టామ్ క్రూయిజ్ అద్భుతంగా చేశాడని కొనియాడారు. ఇప్పటి వరకు రిలీజైన వాటిలో ఇది చాలా బెస్ట్ అని అన్నారు. ఈ సినిమాను మించిన కథ రాదేమో అని అనుకుంటున్నట్లు ఆర్జీవీ మాట్లాడారు.
కానీ ఈ సినిమా చూశాక ఆయన చేసిన ఓ కామెంట్ తెగ వైరలవుతోంది. మనం కూడా ఫిల్మ్ మేకర్స్ అని చెప్పుకోవడానికి సిగ్గేస్తోంది.. అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. రాజమౌళి- మహేశ్ కాంబోలో వస్తోన్న మూవీలో స్టంట్స్ ఇలాగే ఉంటున్నాయని అంటున్నారని ఆర్జీవీ ప్రశ్నించగా.. ఆ విషయం తనకు తెలీదన్నారు. కాగా.. హాలీవుడ్ హీరో టామ్ క్రూయిజ్ నటించిన మిషన్ ఇంపాజిబుల్ ది ఫైనల్ రెకానింగ్ మే 17న ఇండియాాలో రిలీజైంది. ఈ సినిమా చూసిన రాం గోపాల్ వర్మ ఆసక్తికర కామెంట్స్ చేశారు.
#MissionImpossibleTheFinalReckoning#MissionImpossible
MANAM KUDA FILM MAKERS ANI CHEPPU KOVADANIKI SIGGU ESTADI - @RGVzoomin
💥💥💥💥💥
I don't think anyone can say like what RGV has said .
A BRUTAL HONEST OPINION pic.twitter.com/OkrXxyEvva— EXISTENTIAL NIHILIST 👻 (@Forced_Existenc) May 17, 2025