
తొలి ప్రేమ చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన వెంకీ అట్లూరి (Venky Atluri) ఫస్ట్ మూవీకే హిట్టందుకున్నాడు. తమిళ హీరో ధనుష్‌తో సార్ మూవీ చేసి బ్లాక్‌బస్టర్ అందుకున్నాడు. గతేడాది దుల్కర్ సల్మాన్‌తో లక్కీ భాస్కర్ సినిమా (Lucky Baskhar Movie) చేసి మరో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం తమిళ స్టార్ హీరో సూర్యతో సినిమా చేస్తున్నాడు.
లక్కీ భాస్కర్‌కు సీక్వెల్
అయితే లక్కీ భాస్కర్‌కు సీక్వెల్ చేసే ప్లాన్ ఉందంటున్నాడు వెంకీ అట్లూరి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని రివీల్ చేశాడు. వెంకీ అట్లూరి మాట్లాడుతూ.. సీతారామం సినిమాతో దుల్కర్ సల్మాన్ తెలుగు హీరో అయిపోయాడు. ఆయనకు లక్కీ భాస్కర్ కథ ఫస్టాఫ్ చెప్పగానే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ సినిమా అయిపోయాక చాలామంది పీరియాడిక్ ఫిలిం, బయోపిక్స్ చేస్తారా? అని అడిగారు. కానీ పీరియాడిక్, బయోపిక్, సంచలన థ్రిల్లర్ చిత్రాలు నేను చేయను. కుటుంబ కథా చిత్రాలు చేయాలని ఉంది. లక్కీ భాస్కర్‌కు సీక్వెల్ ఉంటుంది అని చెప్పుకొచ్చాడు.
సినిమా
లక్కీ భాస్కర్ సినిమా విషయానికి వస్తే.. ఇందులో దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి జంటగా నటించారు. నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించాడు. 2024 అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.111 కోట్లు రాబట్టింది.
చదవండి: 'మరాఠీ మాట్లాడను, దమ్ముంటే మహారాష్ట్ర నుంచి నన్ను వెళ్లగొట్టండి.. నటుడి సవాల్