
బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ ప్రస్తుతం నిషాంచి అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ చిత్రంలో వినీత్ కుమార్ సింగ్ హీరోగా నటించారు. ఈ సినిమాతో ఐశ్వర్య థాకరే హీరోయిన్గా ఎంట్రీ ఇస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా వచ్చేనెల 19న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన దర్శకుడు ఈ మూవీ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
ఈ మూవీని ఎంఎస్ ధోని హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌తో చేయాలని అనుకున్నానని అనురాగ్ కశ్యప్ వెల్లడించారు. ఈ ప్రాజెక్ట్ను 2016లోనే ప్రకటించామని తెలిపారు. అయితే అప్పటికే సుశాంత్ ధర్మ ప్రొడక్షన్స్తో రెండు సినిమాలకు సంతకం చేశారని గుర్తు చేసుకున్నారు. అందువల్లే మా సినిమాకు అతను రెస్పాండ్ కాలేదని అనురాగ్ పంచుకున్నారు.
అనురాగ్ కశ్యప్ మాట్లాడుతూ.." అప్పట్లో సుశాంత్ (సింగ్ రాజ్‌పుత్)తో చేయాలనుకున్న సినిమా ఇది. అప్పటికే అతనికి 'దిల్ బెచారా', 'డ్రైవ్' అనే రెండు పెద్ద సినిమాలు ఆఫర్ వచ్చాయి. అవి రెండూ కూడా ధర్మ ప్రొడక్షన్స్లోనివే. దీంతో అప్పుడు నా సినిమా ఆగిపోయింది. మా సినిమాకు ఓకే చెప్పేందుకు అతను స్పందించడం మానేశాడు. అందుకే నేను కూడా దూరంగా వెళ్లిపోయా. మొదట 2016లో సుశాంత్ హీరోగానే మూవీని ప్రకటించా" అని అన్నారు.
అంతేకాకుండా తన నిర్మాణ సంస్థలో వచ్చిన 'హసీతో ఫసీ' సినిమా నుంచి సుశాంత్ తప్పుకున్న విషయాన్ని కూడా కశ్యప్ వెల్లడించారు. యష్ రాజ్ ఫిల్మ్స్ (YRF), ధర్మ ప్రొడక్షన్స్ నుంచి ఆఫర్లు రావడంతో సుశాంత్ మా ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారని వివరించారు. YRF నిర్మాణ సంస్థ 'శుద్ధ్ దేశీ రొమాన్స్' సినిమాకు సంతకం చేసిన సుశాంత్.. హసీ తో ఫసీ మూవీని వదులుకున్నాడని కశ్యప్ అన్నారు. అతని నిర్ణయంపై తనకు ఎలాంటి పగ లేదని కశ్యప్ తెలిపారు.
నిషాంచి సినిమా చేసేందుకు చాలామంది నటులు ఆసక్తి చూపించారని అనురాగ్ కశ్యప్ తెలిపారు. కానీ 2016లో MS ధోని: ది అన్‌టోల్డ్ స్టోరీ విడుదలకు ముందే సుశాంత్‌ను సంప్రదించానని వెల్లడించారు. ఆ సినిమా సూపర్ హిట్ అయిన తర్వాత, సుశాంత్ తన వద్దకు తిరిగి రాలేదని ఆయన గుర్తు చేసుకున్నారు. కాగా.. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ 2013లో 'కై పో చే!' సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు. ఆ తర్వాత 'శుద్ధ్ దేశీ రొమాన్స్', 'పీకే', 'కేదార్‌నాథ్', 'చిచ్చోరే' లాంటి చిత్రాలలో కనిపించాడు. 'ఎంఎస్ ధోని: ది అన్‌టోల్డ్ స్టోరీ' బయోపిక్‌లో మహేంద్ర సింగ్ ధోని పాత్రలో మెప్పించాడు. కానీ ఊహించని విధంగా..34 ఏళ్ల సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ జూన్ 14, 2020న తన బాంద్రా నివాసంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు.