
రక్త చరిత్ర, లెజెండ్, లయన్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన ముద్దుగుమ్మ రాధికా ఆప్టే. ఆ తర్వాత అయితే తెలుగు సినిమాల్లో పెద్దగా కనిపించలేదు. ప్రస్తుతం బాలీవుడ్, తమిళంలో మాత్రమే సినిమాలు చేస్తోంది. గతేడాది మేరీ క్రిస్‌మస్, సిస్టర్ మిడ్‌నైట్ లాంటి చిత్రాల్లో కనిపించింది. ప్రస్తుతం లాస్ట్ డేస్ అనే మూవీలో కనిపించనుంది.
ఇదిలా ఉండగా తాజాగా రాధిక ఆప్టేకు సంబంధించిన ఓ వార్త నెట్టింట తెగ వైరలవుతోంది. త్వరలోనే రాధికా ఆప్టే దర్శకురాలిగా ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్‌లో తెరకెక్కించబోయే కోట్యా అనే ఓ యాక్షన్ మూవీతో డైరెక్టర్‌గా ఎంట్రీ ఇవ్వనుంది. ఈ విషయాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ సినీవీ-సీహెచ్‌డీ వెల్లడించిది. ఈ సినిమాను నిర్మాత విక్రమాదిత్య మోత్వానే నిర్మిస్తారని సమాచారం. ఏదేమైనా బాలయ్య హీరోయిన్ డైరెక్టర్‌గా ఎంట్రీ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.
కాగా..రాధికా ఆప్టే ప్యాడ్‌మ్యాన్, అంధాధున్, విక్రమ్ వేద, ఎ కాల్ టు స్పై, కబాలి, లస్ట్ స్టోరీస్ వంటి చిత్రాలతో అటు బాలీవుడ్.. ఇటు కోలీవుడ్‌లోనూ గుర్తింపు తెచ్చుకుంది. ఆమె చివరిసారిగా నటించిన సిస్టర్ మిడ్‌నైట్ బాఫ్టాకు నామినేట్ అయింది. అంతేకాకుండా సిస్టర్ మిడ్‌నైట్ గతంలో కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించారు. కాగా.. రాధికా ఇటీవల భర్త బెనెడిక్ట్ టేలర్‌తో ఒక బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.