
హైదరాబాద్: సార్కోమా అవగాహన మాసం సందర్భంగా అపోలో క్యాన్సర్ సెంటర్‌లో బోన్ క్యాన్సర్‌ను జయించిన పలువురు రోగులను వారి ధైర్యం, పట్టుదల మరియు మానసిక బలానికి గుర్తింపుగా ఘనంగా సత్కరించారు. ఈ సందర్బంగా అపోలో క్యాన్సర్ సెంటర్ డైరెక్టర్ డా. పి. విజయ్ ఆనంద్ రెడ్డి గారు మాట్లాడుతూ ఎముకలు మరియు సాఫ్ట్ టిష్యూలో ఏర్పడే అరుదైన క్యాన్సర్ అయిన సార్కోమా వ్యాధి అని దీని గురించి ప్రజల్లో అవగాహన పెంచడం లక్ష్యంగా పెట్టుకొని ప్రారంభ దశలో గుర్తించినట్లయతే వాటిని సమర్థవంతంగా నయం చేయవచ్చని ఆయన తెలిపారు.
ఆర్థోపెడిక్ ఆంకాలజిస్టు డా. రాజీవ్ రెడ్డి మాట్లాడుతూ, ‘బోన్ క్యాన్సర్ చికిత్సలు క్లిష్టమైనవే కాక శారీరకంగా చాలా కష్టం, అయినా, ఈ వ్యాధిని ఎదుర్కొని గెలిచిన వారు అసాధారణమైన సంకల్పాన్ని ప్రదర్శించారు. వీరి కథలు, ఇలాంటి పరిస్థితిలో ఉన్న ఇతరులకు స్ఫూర్తిగా నిలుస్తాయని అన్నారు.
ఈ కార్యక్రమానికి ప్రముఖ ఆంకాలజిస్టులు, ఆర్థోపెడిక్ సర్జన్లు, వైద్య నిపుణులు, డా. నిఖిల్ సురేశ్ (డైరెక్టర్ మెడికల్ ఆంకాలజీ), డా. కె. జె. రెడ్డి, డా. సుబ్బారెడ్డి, డా. అజేష్ రాజేశ్ సక్సేనా, డా. రాము దాములూరి, డా. శ్రీనాథ్ భారద్వాజ్ పాల్గొన్నారు. అపోలో హాస్పిటల్స్ మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్ డా. రవీంద్రబాబు అన్నం మాట్లాడుతూ, ‘ఇలాంటి సమ్మేళనాలు బోన్ క్యాన్సర్‌ను విజయవంతంగా ఎదుర్కొనచ్చన్న బలమైన సందేశాన్ని ఇస్తాయని క్యాన్సర్ బలమైనదైనా, మానవ మనస్సు ఇంకా బలంగా ఉంటుందన్న సందేశాన్ని పంచుతాయి‘ అని చెప్పారు.