అల్లు అర్జున్‌ డైరెక్టర్‌ చిత్రాలన్నీ కాపీనే?.. దర్శకుడి రియాక్షన్‌ ఇదే! | Atlee addresses criticism that his films are copied in chennai | Sakshi
Sakshi News home page

Atlee: మీ సినిమాలన్నీ కాపీనేనా?.. విమర్శలపై అట్లీ స్పందన ఇదే!

Jun 15 2025 7:38 PM | Updated on Jun 15 2025 7:41 PM

Atlee addresses criticism that his films are copied in chennai

జవాన్ మూవీతో బ్లాక్‌బస్టర్‌ హిట్ కొట్టిన కోలీవుడ్ డైరెక్టర్‌ అట్లీ. షారూఖ్ ఖాన్, నయనతార జంటగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించింది. ప్రస్తుతం ఈ ఏడాది బిగ్‌ ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేశారు. అది కూడా మన ఐకాన్ స్టార్‌ అల్లు అర్జున్‌తో జతకట్టారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న తొలి మూవీ కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో బాలీవుడ్ భామ దీపికా పదుగొణె హీరోయిన్‌గా కనిపించనుంది.

అయితే కోలీవుడ్‌లో స్టార్‌ డైరెక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్న అట్లీ గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. చెన్నైలోని సత్యభామ విశ్వవిద్యాలయం ఆయనను డాక్టరేట్ ఇచ్చి సత్కరించింది. ఈ సందర్భంగా డాక్టరేట్‌ స్వీకరించిన అట్లీ సినిమాల గురించి ప్రస్తావించారు. ముఖ్యంగా తన చిత్రాలన్నీ కాపీ చేశారంటూ వస్తున్న విమర్శలపై ఆయన స్పందించారు. అంతేకాకుండా అల్లు అర్జున్‌ సినిమా గురించి కూడా మాట్లాడారు.

అట్లీ మాట్లాడుతూ.. "సాధారణంగా ప్రేక్షకులు నా సినిమాలు కాపీ అని అంటారు.కానీ ఈ రోజు నా జీవితం గురించి నేను మీకు చెప్తా. ఈ రోజు నిజం చెబుతున్నా నేను తీసే సినిమాలన్నీ నా జీవితం నుంచి ప్రేరణ పొందా. ఇవాళ మీకు కనెక్ట్ అయ్యే  ఒక ఉదాహరణ చెప్తా. విజయ్ నటించిన బిగిల్ సినిమా.. గ్యాంగ్‌స్టర్ నుంచి ఫుట్‌బాల్ కోచ్‌గా మారిన మైఖేల్ రాయప్పన్ పాత్రను జేపీఆర్‌ సార్‌ జీవితం నుంచి ప్రేరణ పొందా. రాయప్పన్ ఈ విశ్వవిద్యాలయ వ్యవస్థాపకుడు, ఛాన్సలర్‌ కూడా. ఈ రోజు మీరు నాకు డాక్టరేట్‌ ఇచ్చారు. నేను ఈ దేశం గర్వపడేలా చేస్తానని హామీ ఇస్తున్నా" అని అన్నారు.

అల్లు అర్జున్ చిత్రం గురించి మాట్లాడుతూ..' ఈ సినిమాను కళానిధి మారన్ సర్ (సన్ పిక్చర్స్) నిర్మిస్తున్నారు. ఇది మన దేశంలో అత్యంత ఖరీదైన చిత్రాలలో ఒకటిగా నిలవనుంది. ఈ మూవీ కోసం అంతా కొత్త టెక్నాలజీని ఉపయోగిస్తున్నాం. ఈ చిత్రం కోసం నేను పెద్ద కలలు కంటున్నా. ఈ మూవీ బడ్జెట్ ఇంకా లాక్ కాలేదు. నిర్మాత విడుదల తేదీని నిర్ణయిస్తారు.' అని పంచుకున్నారు.
 

 

Advertisement
 
Advertisement
Advertisement