
కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ హీరోగా వస్తోన్న తాజా చిత్రం సర్దార్-2. ఈ సినిమాకు పీఎస్ మిత్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రిన్స్ పిక్చర్స్ పతాకంపై ఎస్.లక్ష్మణన్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. గతంలో కార్తీ తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేసిన సర్దార్ చిత్రం విడుదలై మంచి విజయాన్ని సాధించింది. దీంతో ఈ మూవీకి సీక్వెల్గా సర్దార్–2 రూపొందిస్తున్నారు. ఇప్పటికే టీజర్ రిలీజ్ కాగా.. అదిరిపోయే రెస్పాన్ వచ్చింది.
ఇటీవలే సర్దార్-2 మూవీ షూటింగ్ పూర్తి చేసుకుంది. దీంతో చిత్రయూనిట్ సభ్యులకు మేకర్స్ భోజనాలు ఏర్పాటు చేసి విందు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో హీరో కార్తీ స్వయంగా అందరికీ భోజనాలు వడ్డించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇది చూసిన నెటిజన్స్ కార్తీ ది గ్రేట్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
కాగా.. ఈ మూవీలో కార్తీ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఈ చిత్రంలో ఎస్‌జే సూర్య, మాళవికమోహన్, ఆషికా రంగనాథ్, రాజిషా విజయన్, యోగిబాబు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. శ్యామ్ సీఎస్ సంగీతాన్ని అందిస్తున్నారు.
Unseen 🚨😍
Our man himself served briyani
for the completion of the #Sardar2 shoot.@Karthi_Offl #Karthi #MrVersatileKarthi pic.twitter.com/JtxT0y5fPI— Karthi Trends (@Karthi_Trendz) July 31, 2025