పృథ్విరాజ్ సుకుమారన్‌ ‘సర్ జమీన్’ మూవీ రివ్యూ | Prithviraj Sarzameen Movie Review And Rating In Telugu | Sakshi
Sakshi News home page

Sarzameen Movie Review: తండ్రి వేదన...తనయుడి ఆవేదన...

Jul 30 2025 1:22 PM | Updated on Jul 30 2025 1:38 PM

Prithviraj Sarzameen Movie Review And Rating In Telugu

ఈ రోజుల్లో మంచి కోసం వెతకాలి, అయితే అదే చెడు గురించి ఆలోచిస్తే చాలు చుట్టూ చటుక్కున అల్లుకుపోతుంది. మనవాడు అనేవారు మనకోసం ఎప్పటికీ నిలబడతాడు, అలాగే పగవాడు మన పతనం కోసం ఆరాటపడతాడు. మంచిని దూరం చేసుకోని చెడు మార్గాన వెళుతూ మనవాడు కూడా పగవాడైతే అదే సర్ జమీన్ సినిమా.

ఇదో దేశభక్తి స్ఫూర్తిగా అల్లుకున్న కథ. కాయోజీ ఇరానీ అనే దర్శకుడు తీసిన ఈ సినిమాలో ముఖ్య పాత్రధారులుగా వర్ధమాన మళయాళ నటుడు పృథ్విరాజ్, బాలీవుడ్ నటి కాజల్ వంటి హేమాహేమీలే కాక ప్రముఖ నటుడు సైఫ్ అలీఖాన్ కొడకు ఇబ్రహీం అలీ ఖాన్ కూడా నటించడం విశేషం.ఈ కథ ఓ ప్రత్యేకమైనది అని చెప్పుకోవచ్చు. నాలుగంటే నాలుగు ముఖ్య పాత్రలు, రెండున్నర గంటల నిడివి తో దేశ సరిహద్దు వివాదాంశంపై సైనిక నేపధ్యంతో కూడిన సినిమా తీయడం అంటే మాటలు కాదు. ఈ సినిమా స్క్రీన్ ప్లే తో ప్రేక్షకుడిని ఉర్రూతలూగిస్తాడు దర్శకుడు. అంతలా ఏముందీ కథలో ఓ సారి చూద్దాం. 

జమ్ము కాశ్మీర్ ప్రాంతంలో కల్నల్ విజయ్ మీనన్ పోస్టింగ్ జరుగుతుంది. విజయ్ మీనన్ మహా దేశభక్తుడు. దేశమా, ప్రాణమా అంటేనే నిర్మొహమాటంగా దేశం అని ఎంచుకునే రకం. విజయ్ కి హర్మన్ అనే ఓ కొడుకుంటాడు. చిన్నప్పటి నుండి హర్మన్ చాలా భయస్తుడు. ఈ విషయంలోనే తన తండ్రి విజయ్ పై ద్వేషం పెంచుకుంటాడు హర్మన్. ఓ సారి తీవ్రవాదుల ఘర్షణలో హర్మన్ ను టెర్రరిస్టులు కిడ్నాప్ చేస్తారు. తమ ముఖ్య అనుచరుడిని విడిపించాలని లేదంటే విజయ్ కొడుకుని చంపేస్తామని టెర్రరిస్టులు విజయ్ ని హెచ్చరిస్తారు. 

ఇవన్నీ పట్టించుకోకుండా తాను బంధించిన టెర్రరిస్టులపై కాల్పులు జరుపుతాడు విజయ్. ఆ తరువాత విజయ్, విజయ్ భార్య మెహర్ తమ బిడ్డ చనిపోయాడని భావిస్తారు. కాని తీవ్రవాదులు హర్మన్ కి తండ్రి మీదున్న ద్వేషాన్ని ఆయుధంగా చేసుకుని హర్మన్ ని తీవ్రవాదిగా తయారు చేసి మళ్ళీ విజయ్ దగ్గరకు పంపుతారు. ఆ తరువాత విజయ్ అతని భార్య తమ కొడుకు టెర్రరిస్ట్ అని కనిపెడతారా లేదా అన్నదే సినిమా. 

దేశం మీద మమకారం పెంచుకున్న తండ్రి వేదన గెలుస్తుందా... లేక తండ్రి మీద తనయుడు పెంచుకున్న ద్వేషం గెలుస్తుందా అన్నది హాట్ స్టార్ లోనే చూడాలి. ఈ సినిమా ఓ సూపర్ పేట్రియాటిక్ థ్రిల్లింగ్ ఫీలింగ్ఇస్తుంది. ఆఖర్లో వచ్చే ట్విస్ట్ సినిమా మొత్తానికే హైలైట్.మస్ట్ వాచ్.
- హరికృష్ణ, ఇంటూరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement