షూటింగ్ లో గాయపడ్డ హీరో కార్తి | Karthi Injured In Sardar 2 Movie Shooting | Sakshi
Sakshi News home page

Karthi Injury: గాయపడ్డ హీరో కార్తి.. ఇంతకీ ఏమైంది?

Mar 4 2025 3:28 PM | Updated on Mar 4 2025 3:41 PM

Karthi Injured In Sardar 2 Movie Shooting

తమిళ హీరో కార్తి గాయపడ్డాడు. ఆవారా, యుగానికి ఒక్కడు, ఖైదీ తదితర చిత్రాలతో తెలుగులోనూ కోట్లాది మంది అభిమానుల్ని సంపాదించుకున్న ఈ హీరో ప్రస్తుతం మైసూరులో ఉన్నారు. షూటింగ్ సందర్భంగా గాయపడ్డాడు.

గత కొన్నిరోజుల నుంచి కర్ణాటకలోని మైసూరులో కార్తి కొత్త సినిమా 'సర్దార్ 2' షూటింగ్ జరుగుతోంది. కీలకమైన సన్నివేశాలు తీస్తుండగా ప్రమాదం జరిగింది. ఈ క్రమంలోనే కార్తి కాలికి గాయమైంది. దీంతో టీమ్ దగ్గరలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు.

(ఇదీ చదవండి: కూతురిచ్చిన గిఫ్ట్.. రూ.6 కోట్లకు అమ్మేసిన నటుడు)

ఎలాంటి ఇబ్బంది లేదని, కాకపోతే వారంపాటు విశ్రాంతి తీసుకోవాలని కార్తికి వైద్యులు సూచించారు. దీంతో షూటింగ్ అంతా ఆపేసి చెన్నై వెళ్లిపోయారు. 2022లో వచ్చిన 'సర్దార్' చిత్రానికి ఇది సీక్వెల్. ఇందులో కార్తి, రజిషా విజయన్ తో పాటు ఎస్జే సూర్య, మాళవిక మోహనన్, ఆషికా రంగనాథ్ నటిస్తున్నారు.

సర్దార్ 2 పూర్తి చేసిన తర్వాత కార్తి.. ఖైదీ 2 షూటింగ్ మొదలు పెడతాడు. అంతలో దర్శకుడు లోకేశ్ కనగరాజ్.. రజినీకాంత్ తో 'కూలీ' పూర్తి చేసి వస్తాడు. LCUలో భాగమైన 'ఖైదీ 2' అంచనాలు మాత్రం గట్టిగానే ఉన్నాయ్.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 11 సినిమాలు.. మరి థియేటర్లలో?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement