ఈ వారం ఓటీటీల్లోకి 11 సినిమాలు.. మరి థియేటర్లలో? | Upcoming Ott Movies Telugu On March 1st Week 2025 | Sakshi
Sakshi News home page

This Week OTT Movies: ఓటీటీల్లో ఈ వారం హిట్ మూవీస్ రిలీజ్.. ఏంటంటే?

Mar 3 2025 7:40 AM | Updated on Mar 3 2025 9:23 AM

Upcoming Ott Movies Telugu On March 1st Week 2025

మార్చి తొలివారం వచ్చేసింది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థుల పరీక్షల హడావుడి నడుస్తోంది. అందుకే తెలుగు సినిమాలేం ఈసారి థియేటర్లలో రిలీజ్ కావట్లేదు. కానీ ఛావా, ఆఫీసర్ ఆన్ డ్యూటీ, కింగ్ స్టన్ లాంటి డబ్బింగ్ చిత్రాలు.. ఈ వీకెండ్ లో బిగ్ స్క్రీన్ పై రిలీజ్ కానున్నాయి.

(ఇదీ చదవండి: ఓటీటీలో సంక్రాంతికి వస్తున్నాం.. జీ5 చరిత్రలోనే రికార్డు)

మరోవైపు ఓటీటీలో కేవలం 11 సినిమాలు-వెబ్ సిరీసులే రాబోతున్నాయి. కానీ వీటిలో రేఖాచిత్రం అనే డబ్బింగ్ మూవీతో పాటు తండేల్, విడామయూర్చి, బాపు చిత్రాలు చూడదగ్గవే. ఇవి కాకుండా సర్ ప్రైజ్ రిలీజులు కూడా ఉండొచ్చు. ఇంతకీ ఈ వారం ఏ ఓటీటీలో ఏ మూవీ రానుందంటే?

ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (మార్చి 3-9వ తేదీ వరకు)

నెట్ ఫ్లిక్స్

  • విడామయూర్చి (తెలుగు డబ్బింగ్ మూవీ) - మార్చి 03

  • తండేల్ (తెలుగు సినిమా) - మార్చి 07

  • నదానియాన్ (హిందీ హిందీ మూవీ) - మార్చి 07

అమెజాన్ ప్రైమ్

  • దుఫాహియా (హిందీ సిరీస్) - మార్చి 07

సోనీ లివ్

  • రేఖాచిత్రం (తెలుగు డబ్బింగ్ మూవీ) - మార్చి 07

  • ద వాకింగ్ ఆఫ్ ఏ నేషన్ (హిందీ సిరీస్) - మార్చి 07

హాట్ స్టార్

  • డేర్ డెవిల్: బార్న్ ఎగైన్ (ఇంగ్లీష్ సిరీస్) - మార్చి 04

  • డెలి బాయ్స్ (ఇంగ్లీష్ సిరీస్) - మార్చి 06

  • బాపు (తెలుగు సినిమా) - మార్చి 07

  • తగేష్ vs ద వరల్డ్ (హిందీ సిరీస్) - మార్చి 07

బుక్ మై షో

  • బారా బై బారా (హిందీ మూవీ) - మార్చి 07

(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 20 సినిమాలు)

Advertisement
 
Advertisement
Advertisement