వాళ్లు ఒప్పుకోకపోయినా నేనింకా హీరోయిన్‌నే.. 60 ఏళ్ల సీనియర్‌ నటి | Shanthi Krishna Wants to do Lead Roles, Audience Will Accept me | Sakshi
Sakshi News home page

Shanthi Krishna: నన్ను హీరోయిన్‌గా పెట్టి తీసినా ప్రేక్షకులు ఆదరిస్తారు

Aug 1 2025 1:55 PM | Updated on Aug 1 2025 2:42 PM

Shanthi Krishna Wants to do Lead Roles, Audience Will Accept me

శాంతి కృష్ణ (Shanthi Krishna).. మలయాళంలో ఒకప్పుడు స్టార్‌ హీరోయిన్‌. మలయాళంలోనే కాదు, తమిళ భాషల్లోనూ అనేక సినిమాలు చేసింది. తెలుగులో ప్రియురాలు అనే ఏకైక చిత్రంలో కనిపించింది. ప్రస్తుతం క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా రాణిస్తోంది. అయితే ఇప్పటికీ తనకు హీరోయిన్‌గానే నటించాలనుందని చెప్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో శాంతి కృష్ణ మాట్లాడుతూ.. మోహన్‌లాల్‌, మమ్ముట్టి వంటి స్టార్‌ హీరోలు, దర్శకనిర్మాతలు నన్ను హీరోయిన్‌గా పరిగణించరు. 

హీరోయిన్‌గా చేస్తా...
ఫహద్‌ ఫాజిల్‌, నివిన్‌ పౌలీ వంటి హీరోలకు తల్లిగా నటించాక నన్నెందుకు కథానాయికగా తీసుకోవాలనుకుంటారు? కానీ, ఇప్పటికిప్పుడు నన్ను హీరోయిన్‌గా పెట్టి సినిమా తీసినా.. మలయాళ ప్రేక్షకులు పెద్ద మనసుతో ఆదరిస్తారు. ఇప్పటికీ వారి మనసుల్లో నాకు ప్రత్యేక స్థానం ఉంది అని చెప్పుకొచ్చింది. శాంతి కృష్ణకు ఇప్పుడు 60 ఏళ్లు. కొన్నాళ్లపాటు బెంగళూరులో ఉన్న ఆమె ప్రస్తుతం కొచ్చిలో సెటిలైంది. 

ఇప్పుడు హ్యాపీగా ఉంది
దీని గురించి నటి మాట్లాడుతూ.. నేను మళ్లీ కేరళకుట్టిగా మారిపోయాను. కొచ్చిలో ఇల్లు తీసుకున్నాను. దీనికి శ్రీకృష్ణం అనే పేరు పెట్టాను. శ్రీ కృష్ణుని ఆలయం పక్కనే మా ఇల్లు ఉండటంతో అదే పేరు నా నివాసానికి పెట్టుకున్నాను. పిల్లల చదువుల కోసం చాలా ఏళ్లు బెంగళూరులో ఉన్నాను. చివరకు నా మనసుకెంతో దగ్గరైన ప్రదేశంలోనే ఇల్లు తీసుకుని సంతోషంగా జీవిస్తున్నాను. ఇక్కడికి షిఫ్ట్‌ అవమని నా స్నేహితులు పదేపదే చెప్పారు. మొత్తానికి ఇక్కడికి వచ్చేశాక మనసుకెంతో తృప్తిగా ఉంది అని చెప్పుకొచ్చింది.

చదవండి: కింగ్డమ్‌ తొలిరోజు కలెక్షన్స్‌.. విజయ్‌ దేవరకొండ మాస్‌ కమ్‌బ్యాక్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement