నితిన్ సినిమా వల్లే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నా: డైరెక్టర్‌ | Director Sriram Venu Interesting Comments In thammudu trailer Event | Sakshi
Sakshi News home page

Sriram Venu: నితిన్ సినిమా వల్లే నా పెళ్లి జరిగింది: డైరెక్టర్‌

Jun 11 2025 8:04 PM | Updated on Jun 11 2025 8:47 PM

Director Sriram Venu Interesting Comments In thammudu trailer Event

నితిన్ హీరోగా నటించిన తాజా చిత్రం తమ్ముడు. ఈ సినిమాకు శ్రీరామ్‌ వేణు దర్శకత్వం వహించారు. ీ చిత్రంలో సప్తమీ గౌడ, వర్ష బొల్లమ్మ హీరోయిన్లుగా నటించారు. దాదాపు 20 ఏళ్ల తర్వాత టాలీవుడ్ నటి లయ రీ ఎంట్రీ ఇస్తోంది. ఈ చిత్రంలో నితిన్‌కు అక్క పాత్రలో లయ కనిపించనున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌లో దిల్‌రాజు, శిరీష్ నిర్మించారు.

ఈ ఈవెంట్‌లో డైరెక్టర్ శ్రీరామ్ వేణు ఆసక్తికర కామెంట్స్ చేశారు. ముఖ్యంగా హీరో నితిన్‌పై ప్రశంసలు కురిపించారు. నాకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చిన హీరో నితిన్ మాత్రమేనని అన్నారు. ఆర్టిస్టులు చాలామంది ఇన్‌సెక్యూర్‌గా ఉంటారని.. కానీ అతనిలో ఏమాత్రం అభద్రతాభావం ఉండదని తెలిపారు. నితిన్ సినిమాకు రైటర్‌గా వెళ్లి ఓ అమ్మాయిని పెళ్లి చేసుకున్నానని శ్రీరామ్ వేణు వెల్లడించారు. ఇంతకుముందే నితిన్‌తో నేను సినిమా చేయాల్సిందని..కానీ నా వల్లే కాస్తా ఆలస్యమైందని పేర్కొన్నారు. 

కాగా.. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న తమ్ముడు జూలై 4న థియేటర్లలో సందడి చేయనుంది. కాగా.. ఈ చిత్రంలో సౌరభ్ సచ్‌దేవా, హరి తేజ, శ్రీకాంత్ అయ్యంగార్, టెంపర్ వంశీ, చమ్మక్ చంద్ర కీలక పాత్రల్లో నటించారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement