
నోయల్ ఎన్ టాటాను డైరెక్టరుగా నియమించడం సహా ఆరు కీలక తీర్మానాలకు టాటా సన్స్ షేర్‌హోల్డర్లు ఏకగ్రీవంగా ఆమోదముద్ర వేశారు. షాపూర్‌జీ పల్లోంజీ గ్రూప్ కూడా మద్దతు తెలిపినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. రతన్ టాటా మరణం తర్వాత 2024 అక్టోబర్ 22 నుంచి నోయెల్ టాటా అదనపు డైరెక్టరుగా నియమితులయ్యారు.
మరోవైపు, వర్చువల్‌గా నిర్వహించిన వార్షిక సర్వ సభ్య సమావేశంలో టాటా సన్స్ డైరెక్టరుగా టీవీఎస్ మోటర్స్ గౌరవ చైర్మన్ వేణు శ్రీనివాసన్ నియామకానికి కూడా ఆమోదం లభించినట్లు వివరించాయి. టాటా సన్స్‌లో టాటా ట్రస్ట్స్‌కి 66 శాతం, షాపూర్‌జీ పల్లోంజీ గ్రూప్‌నకు 18.4 శాతం వాటాలు ఉన్నాయి. అంతా ఊహించినట్లే రతన్ టాటా అనంతరం టాటా ట్రస్ట్స్ పగ్గాలు తన సోదరుడు నోయెల్ టాటా (68) చేతికి లభించాయి. టాటా ట్రస్ట్స్‌తో పాటు అందులో భాగమైన మిగతా ట్రస్ట్‌లన్నింటికి కూడా చైర్మన్‌గా ట్రస్టీలు గతంలో జరిగిన సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఇదీ చదవండి: రూపాయి 79 ఏళ్ల ప్రస్థానం