
బాహుబలి విడుదలై పదేళ్లు పూర్తయిన సందర్భంగా మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు మన దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి. బాహుబలి ది బిగినింగ్, బాహుబలి-2 రెండు భాగాలను కలిపి బాహుబలి ది ఎపిక్ పేరుతో రిలీజ్ చేస్తున్నారు.
తాజాగా ఈ మూవీ టీజర్ను విడుదల చేశారు. సోషల్ మీడియా వేదికగా డైరెక్టర్ రాజమౌళి టీజర్ రిలీజ్ చేశారు. ఈ చిత్రం ఈ ఏడాది అక్టోబరు 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. త్వరలోనే ఈ సినిమా ప్రమోషన్స్ ప్రారంభించనున్నారు మేకర్స్. ప్రభాస్, అనుష్క, రానా, రాజమౌళి సైతం ప్రమోషన్లలో పాల్గొననున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ కోసం రెబల్ స్టార్ ఫ్యాన్స్ సైతం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Here’s the Teaser of @ssrajamouli’s #BaahubaliTheEpic… In cinemas worldwide Oct 31, 2025. https://t.co/KSuKxSwZI9#Prabhas@RanaDaggubati @MsAnushkaShetty @tamannaahspeaks @Shobu_ #PrasadDevineni #Baahubali #Celebrating10YearsOfBaahubali#BaahubaliTheEpicOn31stOct pic.twitter.com/EXQsQGFoZ8
— Baahubali (@BaahubaliMovie) August 26, 2025