
శాండల్వుడ్ హీరో ధృవ సర్జా హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం కేడీ ది డెవిల్. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ శిల్పాశెట్టి, సంజయ్ దత్ కీలక పాత్రల్లో నటించారు. దాదాపు 20 ఏళ్ల తర్వాత కన్నడలో రీ ఎంట్రీ ఇస్తోంది. 1970లలో బెంగళూరులో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. ఈ చిత్రానికి ప్రేమ్ దర్శకత్వం వహించగా.. కేవీఎన్ ప్రొడక్షన్ బ్యానర్లో తెరకెక్కించారు.
తాజాగా ఈ మూవీ టీజర్ లాంఛ్ ఈవెంట్‌ను హైదరాబాద్లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవెంట్కు హాజరైన డైరెక్టర్ ప్రేమ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ప్రభాస్ తనను యోగి సినిమా డైరెక్ట్ చేయాలని పిలిచారని అన్నారు. కానీ భాష సమస్య వల్ల తాను చేయలేక.. రీమేక్ రైట్ ఇచ్చేశానని తెలిపారు. తాను దర్శకత్వం వహించిన జోగి మూవీనే తెలుగులో రీమేక్ చేశారని ప్రేమ్ వెల్లడించారు. తాజాగా డైరెక్టర్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.