Raghav Omkar Sasidhar
-
లగ్జరీ కారు కొన్న టాలీవుడ్ డైరెక్టర్.. పోస్ట్ వైరల్
టాలీవుడ్ డైరెక్టర్ రాఘవ్ ఓంకార్ శశిధర్ ఖరీదైన కారు కొనుగోలు చేశారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఈ కొత్త ప్రయాణం చాలా గర్వంగా ఉందన్నారు. నా ఫ్యామిలీలోకి మెర్సిడెజ్ ఈ క్లాస్ కారును సాదరంగా ఆహ్వనిస్తున్నానంటూ పోస్ట్ చేశారు. ఇది కేవలం కారు మాత్రమే కాదు.. ఓర్పు, కృషి, విశ్వాసం ఎల్లప్పుడూ మనల్ని ముందుకు నడిపిస్తాయని గుర్తుచేస్తుందని రాసుకొచ్చారు. ఈ కారు విలువ దాదాపు రూ.కోటి వరకు ఉన్నట్లు తెలుస్తోంది.కాగా.. రాఘవ్ ఓంకార్ శశిధర్ ది 100 మూవీకి దర్శకత్వం వహించారు. 2024లో వచ్చిన ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. ఈ చిత్రంలో ఆర్కే సాగర్, మిషా నారంగ్, ధన్య బాలకృష్ణ, విష్ణు ప్రియ, తారక్ పొన్నప్ప కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీని కెఆర్ఐఏ ఫిల్మ్ కార్ప్, ధమ్మ ప్రొడక్షన్స్ బ్యానర్లపై రమేష్ కరుటూరి, వెంకీ పూశడపు నిర్మించారు. అంతేకాకుండా డైరెక్టర్ శశిధర్.. ఓంకారం, నన్ను క్షమించండి, లడ్డు ఏ స్వీట్ మెమొరీ లాంటి సినిమాలకు దర్శకత్వం వహించారు. View this post on Instagram A post shared by Sasidhar P (@raghavomkarsasidhar) -
‘ది 100’ విజయం ఆరంభం మాత్రమే : రాఘవ్ ఓంకార్ శశిధర్
"ది 100" చిత్రంతో తొలి దర్శకుడిగా అడుగుపెట్టి, బాధ్యతాయుతమైన పోలీస్ డ్రామాతో ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు రాఘవ్ ఓంకార్ శశిధర్. జూలై 11న విడుదలైన ఈ యాక్షన్ థ్రిల్లర్‌కు వచ్చిన స్పందనపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శశిధర్ మాట్లాడుతూ, "ఈ చిత్రం కేవలం పోలీస్ కథ కాదు, భావోద్వేగం, బాధ్యత, నీతితో కూడిన కథాంశం. నిజాయితీ గల ఐపిఎస్ అధికారి విక్రాంత్‌గా ఆర్కే సాగర్, అలాగే మిషా నారంగ్, ధన్య బాలకృష్ణ పాత్రలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. మహిళా ప్రేక్షకులు ముఖ్యంగా ఈ చిత్రంలోని ఎమోషన్స్‌తో బాగా కనెక్ట్ అయ్యారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నాగబాబు, అంజనా దేవి, ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనార్ వంటి ప్రముఖుల నుంచి ప్రశంసలు రావడం ఆనందంగా ఉంది. థియేటర్లలో సినిమాను ఆదరించిన ప్రేక్షకులకు, మీడియాకు, నిర్మాతలు రమేష్ కరుటూరి, వెంకీ పూషడపు, జే తారక్ రామ్, హీరో ఆర్కే సాగర్లకు కృతజ్ఞతలు. ఈ విజయం నా జర్నీలో మొదటి అడుగు మాత్రమే. భవిష్యత్తులో మరిన్ని మంచి చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రావాలని ఆశిస్తున్నాను," అని అన్నారు.


