తమన్నా మరో ఐటమ్ సాంగ్.. వీడియో రిలీజ్ | Aryan Khan’s Netflix Debut “The Bads of Bollywood” Gets Mixed Reviews; Tamannaah’s Special Song Out | Sakshi
Sakshi News home page

Tamannaah Bhatia: షారుఖ్ కొడుకు కోసం తమన్నా స్పెషల్ సాంగ్

Sep 19 2025 3:51 PM | Updated on Sep 19 2025 4:00 PM

Tamannaah Bhatia Ghafoor Video Song

బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్.. రీసెంట్‌గానే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. 'ద బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్' సిరీస్‌తో దర్శకుడిగా మారాడు. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ ఏడు ఎపిసోడ్ల ఈ సిరీస్.. గురువారం(సెప్టెంబరు 18) నుంచి అందుబాటులోకి వచ్చింది. దీనికి మిక్స్‌డ్ రెస్పాన్స్ వస్తోంది. బాలీవుడ్ నటీనటులతో పాటు రాజమౌళితో అతిథి పాత్ర చేయించినప్పటికీ పెద్దగా వర్కౌట్ కాలేదని అంటున్నారు.

(ఇదీ చదవండి: 'మిరాయ్' విలనిజం తెచ్చిన మెగా అవకాశం?)

అయితే ఈ సిరీస్ కోసం తమన్నాతో ఓ స్పెషల్(ఐటమ్) సాంగ్ చేయించారు. 'గఫూర్' అంటూ సాగే ఈ పాట వీడియోని తాజాగా రిలీజ్ చేశారు. ఈ మధ్య కాలంలో తమన్నా.. వరసగా స్పెషల్ సాంగ్స్ చేస్తూ రచ్చ చేస్తోంది. ఈ గీతం కూడా వాటికి ఏ మాత్రం తగ్గకుండా ఉంది. ఇందులో బాలీవుడ్ ఒకప్పటి విలన్స్ అయిన శక్తి కపూర్, గుల్షన్ గ్రోవర్, రంజీత్ కనిపించడం విశేషం. ఈ సాంగ్‌పై మీరు ఓ లుక్కేసేయండి.

(ఇదీ చదవండి: మౌళి.. రౌడీ టీ షర్ట్, మహేశ్ ట్వీట్.. ఇవన్నీ ఫేక్: బండ్ల గణేశ్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement