
తెలుగు సినిమాల్లో విలన్ అంటే దాదాపు నార్త్ ముఖాలే కనిపిస్తుంటాయి. కానీ రీసెంట్ టైంలో తెలుగు హీరోలు కూడా ప్రతినాయక పాత్రలు చేస్తున్నారు. గత కొన్నాళ్లుగా జగపతిబాబు.. స్టార్ హీరోల సినిమాల్లో విలన్‌గా చేసి ఆకట్టుకున్నారు. రీసెంట్‌గా వచ్చిన 'మిరాయ్'తో మంచు మనోజ్ విలనిజం చూపించాడు. మంచి పేరు కూడా సొంతం చేసుకున్నాడు. ఈ క్రమంలోనే పలు సినిమాల్లో ఈ తరహా రోల్స్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే 'మిరాయ్'లో మనోజ్ చేసిన విలనిజం ఇప్పుడు మెగా అవకాశం తెచ్చినట్లు తెలుస్తోంది. ఏకంగా చిరంజీవి మూవీలో మనోజ్ విలన్‌గా చేయబోతున్నాడని టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తుంది. ప్రస్తుతం అనిల్ రావిపూడితో 'మన శంకరవరప్రసాద్ గారు' సినిమా చేస్తున్న చిరు.. తర్వాత బాబీ దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ చేయబోతున్నారు. మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ అనౌన్స్‌మెంట్ వచ్చింది.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'జూనియర్'.. స్ట్రీమింగ్ డేట్ ప్రకటన)

చిరు-బాబీ గతంలో 'వాల్తేరు వీరయ్య'తో హిట్ కొట్టారు. ఇప్పుడు తీయబోయే సినిమా యాక్షన్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో ఉండబోతుందని పోస్టర్‌తోనే అర్థమైంది. ఇందులో చిరంజీవికి విలన్‌గా మంచు మనోజ్‌ని తీసుకునే ఆలోచన చేస్తున్నారట. ప్రస్తుతం చర్చల దశలో ఉందని, త్వరలోనే ఈ విషయంపై ఓ క్లారిటీ రావొచ్చని తెలుస్తోంది. ఒకవేళ ఇది నిజమైతే మనోజ్ దశ తిరిగినట్లే.
మనోజ్ ఒకప్పుడు హీరోగా సినిమాలు చేశాడు. చాన్నాళ్ల నుంచి యాక్టింగ్ పక్కనబెట్టేశాడు. ఈ ఏడాది 'భైరవం'తో రీఎంట్రీ ఇచ్చాడు. కానీ ఈ మూవీ ఫెయిలైంది. కానీ 'మిరాయ్' హిట్ కావడం ఇతడికి కలిసొచ్చినట్లు కనిపిస్తుంది. ప్రతినాయక పాత్రలు చేస్తే మాత్రం స్టార్ హీరోలకు మనోజ్ ఓ ఆప్షన్ అవుతాడేమో?
(ఇదీ చదవండి: మౌళి.. రౌడీ టీ షర్ట్, మహేశ్ ట్వీట్.. ఇవన్నీ ఫేక్: బండ్ల గణేశ్)