'ఫెయిల్యూర్ బాయ్స్' ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్ | ‘Failure Boys’ First Look Launched in Hyderabad Film Chamber | Sakshi
Sakshi News home page

'ఫెయిల్యూర్ బాయ్స్' ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్

Oct 11 2025 8:40 PM | Updated on Oct 12 2025 10:48 AM

Failure Boys Movie First Look

క్రాంతి, అవితేజ్, ప్రదీప్, సుపర్ణ, పవని ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'ఫెయిల్యూర్ బాయ్స్'. శ్రీ గురుదక్షిణ మూర్తి ఫిలింస్ బ్యానర్‌పై వీవీఎస్ కుమార్, ధన శ్రీనివాస్ జామి, లక్ష్మి వెంకట్ రెడ్డి నిర్మించారు. వెంకట్ రెడ్డి ఉసిరిక దర్శకత్వం వహించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే హైదరాబాద్ ఫిలింఛాంబర్‌లో శనివారం, ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్ చేశారు.

నటుడు సూర్య మాట్లాడుతూ - 'ఫెయిల్యూర్ బాయ్స్' సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ఇంట్రెస్టింగ్‌గా ఉంది. ఈ చిత్రంలో సుమన్, నాజర్, తనికెళ్ల భరణి లాంటి మంచి నటులు ఉన్నారు. యంగ్ టీమ్ అంతా ఈ సినిమాకు వర్క్ చేసింది. ఫెయిల్యూర్ బాయ్స్ సినిమా పెద్ద సక్సెస్ అందుకుని దర్శక నిర్మాతలకు, మూవీ టీమ్ అందరికీ మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నా అని అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement