
మాస్టర్ మహేంద్రన్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘వసుదేవసుతం’(Vasudevasutham). అంబికా వాణి హీరోయిన్‌గా నటిస్తున్నారు. వైకుంఠ్ బోను దర్శకత్వంలో బేబీ చైత్ర శ్రీ బాదర్ల, మాస్టర్ యువ్వాంశ్ కృష్ణ బాదర్ల సమర్పణలో ధనలక్ష్మి బాదర్ల నిర్మిస్తున్న ఈ సినిమా త్వరలో విడుదల కానుంది.
ఈ సినిమా టీజర్‌ను హీరో సత్యదేవ్ విడుదల చేపారు. ‘‘ఈ కథ ధర్మానికి అడ్డొస్తే.. మేనమామ అయినా, లక్షల బంధుగణమైనా, ఎదురుగా కోట్ల సాయుధులే ఉన్నా... ధర్మ హింస తథావచ అన్న శ్రీ కృష్ణుడిదే కాదు. ధర్మాన్ని కా పాడేందుకు ఎంతటి మారణ హోమానికైనా ఎదురెళ్లే ఓ యువకుడిది’ అనే డైలాగ్ ‘వసుదేవసుతం’ సినిమా టీజర్‌లో ఉంది. ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ.