
పులివెందుల మహేష్ హీరోగా, దర్శకుడిగా రూపొందించిన చిత్రం 'స్కూల్ లైఫ్'. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని నవంబర్ 14న అంటే బాలల దినోత్సవం నాడు థియేటర్లలోకి రానుంది. నైనిషా క్రియేషన్స్ బ్యానర్లో గంగాభవని నిర్మాతగా వ్యవహరించారు. సావిత్రి, షన్ను, సుమన్, ఆమని, మురళి గౌడ్ తదితరులు ఇతర పాత్రలు పోషించారు.
మా 'స్కూల్ లైఫ్' నా ఒక్కడి కల కాదు, మా టీమ్ సభ్యులందరూ కలిసి కష్టపడి తీసిన చిత్రం. రాయలసీమ నేటివిటీకి పెద్దపీట వేస్తూ, ఒక స్కూల్ నేపథ్యంలోని చక్కటి ప్రేమ కథ, రైతుల కష్టాలు, స్నేహం తదితర అంశాలతో తెరకెక్కించాం. నవంబర్ 14న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం అని పులివెందుల మహేశ్ చెప్పాడు.