మేఘాలు చెప్పిన ప్రేమ కథ | Meghalu Chappina Prema Katha Movie Trailer launch | Sakshi
Sakshi News home page

మేఘాలు చెప్పిన ప్రేమ కథ

Jun 2 2025 1:12 AM | Updated on Jun 2 2025 1:12 AM

Meghalu Chappina Prema Katha Movie Trailer launch

విపిన్, ఉమాదేవి కోట

నరేష్‌ అగస్త్య, రబియా ఖాతూన్‌ జోడీగా నటించిన చిత్రం ‘మేఘాలు చెప్పిన ప్రేమ కథ’(Meghalu Chappina Prema Katha). విపిన్‌ దర్శకత్వంలో ఉమాదేవి కోట నిర్మించారు. ఈ చిత్రం త్వరలో రిలీజ్‌ కానుంది. ఈ సినిమా టీజర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో విపిన్‌ మాట్లాడుతూ– ‘‘క్లీన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన చిత్రమిది. మా సినిమాలో సంగీత విద్వాంసులు ప్రిన్స్‌ రామవర్మ, ట్రావెల్‌ కోర్‌ వారసులు అతిథి పాత్రలు చేశారు’’ అన్నారు. ఉమాదేవి కోట మాట్లాడుతూ– ‘‘నాకు కథలు రాయడం ఇష్టం.

నా జీవితంలో కె. విశ్వనాథ్, సిరివెన్నెల సీతారామ శాస్త్రిగార్లను కలవడం ఓ భాగ్యం. ఇంట్లో వాళ్ల సపోర్ట్‌తో ఈ బ్యానర్‌ని స్థాపించా. ప్రతి సినిమాలో కళని కనెక్ట్‌ చేయాలనేది నా ఆశ. అందుకే ‘మేఘాలు చెప్పిన ప్రేమ కథ’ని సంగీతానికి ప్రాధాన్యం ఇచ్చేలా తీశాం. ఈ సినిమాను సిరివెన్నెలగారికి అంకితం ఇస్తున్నాం’’ అన్నారు. ‘‘పాటలు చక్కగా వచ్చాయి’’ అన్నారు సంగీత దర్శకుడు జస్టిన్‌ ప్రభాకర్‌. కెమేరామేన్‌ మోహన్‌ కృష్ణ మాట్లాడారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement