కామెడీ... మిస్టరీ | Gamblers Movie Trailer Launch Event | Sakshi
Sakshi News home page

కామెడీ... మిస్టరీ

Jun 2 2025 1:05 AM | Updated on Jun 2 2025 1:05 AM

Gamblers Movie Trailer Launch Event

కేఎస్‌కే చైతన్య, సునీత, రాజ్‌కుమార్‌ బృందావనం

‘మ్యాడ్, మ్యాడ్‌ స్క్వేర్‌’ చిత్రాల ఫేమ్‌ సంగీత్‌ శోభన్‌ హీరోగా, ప్రశాంతి చారులింగా హీరోయిన్‌గా నటించిన చిత్రం ‘గ్యాంబ్లర్స్‌’. కేఎస్‌కే చైతన్య దర్శకత్వం వహించారు. సునీత, రాజ్‌కుమార్‌ బృందావనం నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 6న విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో కేఎస్‌కే చైతన్య మాట్లాడుతూ– ‘‘కామెడీ, మిస్టరీ, ఎమోషన్‌... ఇలా అన్ని వాణిజ్య అంశాలతో రూపొందిన చిత్రం ‘గ్యాంబ్లర్స్‌’.

సినిమా చూస్తున్నంత సేపు ప్రేక్షకులు ఓ కొత్త లోకంలో ఉంటారు. వారికి సరికొత్త అనుభూతినిస్తుంది’’ అన్నారు. ‘‘వైవిధ్యమైన కథతో ‘గ్యాంబ్లర్స్‌’ తీశాం’’ అని రాజ్‌కుమార్‌ బృందావనం తెలిపారు. సునీత మాట్లాడుతూ– ‘‘యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన చిత్రమిది. సంగీత్‌ శోభన్‌ నటన చాలా కొత్తగా ఉంటుంది. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ మా చిత్రాన్ని నైజాంలో విడుదల చేస్తోంది’’ అని చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement