
హీరోయిన్ వర్ష బొల్లమ్మ టైటిల్ రోల్‌లో నటించిన యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘కానిస్టేబుల్ కనకం’. ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకత్వంలో కోవెలమూడి సత్య సాయిబాబా, వేమూరి హేమంత్ కుమార్ నిర్మించిన ఈ సిరీస్ ఈ నెల 14 నుంచి ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా ‘కానిస్టేబుల్ కనకం’ ట్రైలర్‌ను చిరంజీవి విడుదల చేశారు.
ఈ సిరీస్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో వర్ష బొల్లమ్మ మాట్లాడుతూ– ‘‘ఒక అమ్మాయి గౌరవం పెంచేలా ఈ సిరీస్ ఉంటుంది. నాకు కానిస్టేబుల్ కనకం రోల్ ఇచ్చిన దర్శక–నిర్మాతలకు థ్యాంక్స్’’ అన్నారు. ‘‘ఈ కథను నాకంటే ఎక్కువగా నమ్మిన సాయికృష్ణ, నితిన్‌గార్లకు ధన్యవాదాలు’’ అని తెలిపారు ప్రశాంత్. ‘‘ఈ సిరీస్‌ను వీక్షకులు తప్పక చూడండి’’ అని పేర్కొన్నారు సత్య సాయిబాబా.