
‘‘హిందీలో ‘లాపతా లేడీస్’లాంటి సినిమాలు చూసి, మనమెందుకు అలాంటి సినిమాలు చేయలేమని ఆలోచిస్తుంటాం. ఆ కోవలో ఉండే ‘పరదా’ లాంటి సినిమాలు వచ్చినప్పుడు ప్రోత్సహించాలి. ఇలాంటి సినిమాలు విజయం సాధిస్తే, నిర్మాతలకు ధైర్యం వస్తుంది’’ అని హీరో రామ్ అన్నారు. అనుపమా పరమేశ్వరన్ కథానాయికగా, దర్శనా రాజేంద్రన్, సంగీత, రాగ్ మయూర్ కీలక పాత్రల్లో నటించిన సినిమా ‘పరదా’. ‘ది ఫ్యామిలీ మ్యాన్’ సిరీస్ మేకర్స్ రాజ్, డీకేల స పోర్ట్‌తో ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వంలో శ్రీనివాసులు పీవీ, శ్రీధర్ మక్కువతో కలిసి విజయ్ డొంకాడ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 22న విడుదల కానుంది.
శనివారం జరిగిన ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో ముఖ్య అతిథిగా పాల్గొన్న రామ్ మాట్లాడుతూ– ‘‘పరదా’ స్టోరీ లైన్ నాకు తెలుసు. చాలా అద్భుతమైన కథ. అనుపమ నాకు మంచి ఫ్రెండ్. ఏ క్యారెక్టర్ చేసినా వంద శాతం ఎఫర్ట్ పెడుతుంది. ఈ సినిమాలో కూడా అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చింది’’ అన్నారు. ‘‘రామ్‌లాంటి ఫ్రెండ్ ఉండటం నా అదృష్టం. నేను కూడా ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ (రామ్ హీరోగా చేస్తున్న సినిమా) కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను’’ అన్నారు అనుపమా పరమేశ్వరన్. ‘‘ఈ చిత్రంలో నటిగా అనుపమ కొత్త వెర్షన్‌ను చూస్తారు’’ అని పేర్కొన్నారు దర్శక–నిర్మాతలు ప్రవీణ్, విజయ్, శ్రీధర్.