పని ఇంపార్టెంట్‌... పేరు కాదు | Ravi Teja Mr Bachchan Trailer Launch Event | Sakshi
Sakshi News home page

పని ఇంపార్టెంట్‌... పేరు కాదు

Aug 8 2024 5:22 AM | Updated on Aug 8 2024 6:52 AM

Ravi Teja Mr Bachchan Trailer Launch Event

‘సరిహద్దు కాపాడేవాడే సైనికుడు కాదు... సంపద కాపాడేవాడు కూడా సైనికుడే...’ అనే డైలాగ్‌తో ‘మిస్టర్‌ బచ్చన్‌’ సినిమా ట్రైలర్‌ప్రారంభం అవుతుంది. రవితేజ హీరోగా నటించిన చిత్రం ‘మిస్టర్‌ బచ్చన్‌’. హరీష్‌ శంకర్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే కథానాయిక. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వ ప్రసాద్‌ నిర్మించిన ఈ మూవీ ఈ నెల 15న విడుదలవుతోంది. 

ఈ సందర్భంగా బుధవారం ‘మిస్టర్‌ బచ్చన్‌’ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ నిర్వహించారు. ‘నోప్రాబ్లమ్‌ సార్‌.. నాకు పని ఇంపార్టెంట్‌.. పేరు కాదు, ఉయ్‌ ఆర్‌ ఫ్రమ్‌ ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ డిపార్ట్‌మెంట్, ఇండియన్‌ ఆర్మీ ఎంత పవర్‌ఫుల్లో ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ డిపార్ట్‌మెంట్‌ కూడా అంతే పవర్‌ఫుల్‌ అని నిరూపిస్తా, ఆగస్టు 15న ఏం జరిగిందో తెలుసా మీకు.. ఆ రోజు 70ఎంఎం స్టీరియో ఫోనిక్‌ ‘షోలే’ రిలీజ్‌ అయింది’ అంటూ రవితేజ చెప్పే డైలాగులు ట్రైలర్‌లో ఉన్నాయి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement