మాజీ సీఎం పాత్రలో స్టార్ హీరోయిన్..! | Kollywood Actress Trisha To Play Ex CM Jayalalitha Role In Upcoming MGR Biopic, Interesting Deets Inside | Sakshi
Sakshi News home page

Ex CM: మాజీ సీఎం పాత్రలో సీఎం ప్రియురాలు..!

Oct 16 2026 10:23 AM | Updated on Oct 16 2026 12:06 PM

Kollywood actress Trisha will acts In MGR Biopic as EX Cm Jaya lalitha

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత పాత్రపై కోలీవుడ్‌లో ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. ఆమె రోల్‌కు స్టార్ హీరోయిన్ త్రిషను ఎంపిక చేశారని టాక్. తమిళం, తెలుగు భాషల్లో స్టార్‌ హీరోయిన్‌గా కొనసాగిన త్రిష ప్రస్తుతం సినిమాలు పెద్దగా చేయట్లేదు. విజయ్ సీఎం అయ్యాక మళ్లీ వార్తల్లో నిలిచింది. త్రిష తమిళంతో పాటు తెలుగు, కన్నడం, మలయాళం చిత్రాల్లోనూ నటించారు. అదే విధంగా చాలా కాలం క్రితమే కట్టా మిఠా అనే హిందీ చిత్రంలోనూ నటించారు. ఆ విధంగా త్రిష పాన్‌ ఇండియా స్థాయిలో పేరు గాంచారు.

ఈమెపై వ్యక్తిగతంగా, రాజకీయ పరంగా రకరకాల ప్రచారం జరుగుతున్నా.. ఈ ఏడాది విడుదలైన కరుప్పు చిత్రంతో మంచి హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. కొత్త చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్నట్లు ప్రచారం జరుగుతున్నప్పటికీ అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు. ఈ పరిస్థితుల్లో త్రిషను ఒక బయోపిక్‌ చిత్రంలో నటింపజేయడానికి చర్చలు జరుగుతున్నాయని ప్రచారం జోరుగా సాగుతోంది. దివంగత ముఖ్యమంత్రి, మక్కళ్‌ తిరిగాం ఎంజీఆర్‌ బయోపిక్‌ తెరకెక్కనుంది. ఇందులో జేఎం బషీర్‌ ఎంజీఆర్‌గా నటించనున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇటీవల వెల్లడించారు.

అయితే చిత్రంలో కీలకమైన జయలలిత పాత్రలో నటి త్రిషను నటింపజేయడానికి చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ప్రస్తుత పరిస్థితుల్లో త్రిష జయలలిత పాత్రలో నటించడానికి సమ్మతిస్తారా? అన్న చర్చ కూడా జరుగుతోంది. రాజకీయంగా చర్చనీయాంశం అవుతుందన్న విషయం ఆమెకు తెలియంది కాదు. ఇకపోతే ఇంతకుముందు ఎంఎల్‌.విజయ్‌ దర్శకత్వం వహించిన తలైవి చిత్రంలో కంగనా రనౌత్‌ జయలలితగా నటించారు. ఆ తర్వాత వెబ్‌ సిరీస్‌లో నటి రమ్యకృష్ణ కూడా జయలలితగా నటించారు. వీరిద్దరి శారీరక భాష జయలలిత పాత్రకు సరిగా సెట్‌ కాలేదనే విమర్శలు అప్పట్లో వెల్లువెత్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు జయలలిత పాత్రలో త్రిష నటించే సాహసం చేస్తారా అన్న చర్చ జరుగుతోంది. మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement