సస్పెన్స్‌... థ్రిల్‌ | VN Aditya released suspect movie trailer launch | Sakshi
Sakshi News home page

సస్పెన్స్‌... థ్రిల్‌

Mar 13 2025 5:09 AM | Updated on Mar 13 2025 5:09 AM

VN Aditya released suspect movie trailer launch

రుషి కిరణ్, శ్వేత, రూప, శివ యాదవ్, రజిత, ఏకెఎన్‌ ప్రసాద్, మృణాల్‌ ప్రధాన పాత్రల్లో నటించిన సస్పెన్స్‌ థ్రిల్లర్‌ మూవీ ‘ది సస్పెక్ట్‌’. రాధాకృష్ణ దర్శకత్వంలో కిరణ్‌ కుమార్‌ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 21న విడుదల కానుంది. ఎస్‌కేఎమ్‌ఎల్‌ మోషన్‌ పిక్చర్స్‌ ద్వారా ఆంధ్ర, తెలంగాణ ఏరియాల్లో ఈ మూవీ రిలీజ్‌ కానుంది. 

ఈ సినిమా ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన దర్శకుడు వీఎన్‌ ఆదిత్య మాట్లాడుతూ– ‘‘పెద్ద సినిమాలు జీరో కలెక్షన్స్‌ చేసినవీ ఉన్నాయి. అద్భుతంగా ఆదరణ పొందిన చిన్న చిత్రాలూ ఉన్నాయి. ‘ది సస్పెక్ట్‌’ చిన్న చిత్రాల్లో పెద్ద విజయం సాధించాలి.

 కిరణ్‌గారు ఈ సినిమాను నిర్మించడంతో పాటు ఓ మంచి పాత్ర కూడా చేశారు’’ అన్నారు. ‘‘ఒక అమ్మాయి హత్యకు కారకులైన వారిని పట్టుకునే క్రమంలో జరిగే వివిధ సంఘటనల సమాహారమే ఈ చిత్రం’’ అని తెలిపారు రాధాకృష్ణ. ‘‘సినిమా ఇండస్ట్రీలోకి రావాలన్న నా కల ‘ది సస్పెక్ట్‌’తో నెరవేరింది’’ అన్నారు కిరణ్‌ కుమార్‌. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement