లక్కీ భాస్కర్‌ నాకు చాలా ప్రత్యేకం: దుల్కర్‌ సల్మాన్‌ | Dulquer Salmaan Lucky Baskhar Trailer Launch Event | Sakshi
Sakshi News home page

లక్కీ భాస్కర్‌ నాకు చాలా ప్రత్యేకం: దుల్కర్‌ సల్మాన్‌

Oct 22 2024 12:26 AM | Updated on Oct 22 2024 12:26 AM

Dulquer Salmaan Lucky Baskhar Trailer Launch Event

‘‘దాదాపు 14 నెలల తర్వాత నా నుంచి వస్తున్న సినిమా ‘లక్కీ భాస్కర్‌’. ఇది నాకు చాలా ప్రత్యేకమైన చిత్రం. ఇందులో వినోదం, భావోద్వేగాలు, సంగీతం బాగుంటాయి. కుటుంబ ప్రేక్షకులు మెచ్చే అన్ని అంశాలు ఉంటాయి. ట్రైలర్‌ అందరికీ నచ్చిందని భావిస్తున్నాను. అలాగే ఈ సినిమా కూడా అన్నివర్గాల వారికి నచ్చుతుందని నమ్ముతున్నాను’’ అని దుల్కర్‌ సల్మాన్‌ తెలిపారు. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన చిత్రం ‘లక్కీ భాస్కర్‌’.

దుల్కర్‌ సల్మాన్, మీనాక్షీ చౌదరి జోడీగా నటించారు. శ్రీకర స్టూడియోస్‌ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. ఈ సినిమా ఈ నెల 31న తెలుగు, మలయాళ, తమిళ, హిందీ, కన్నడ భాషల్లో విడుదల కానుంది. ఈ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో మీనాక్షీ చౌదరి మాట్లాడుతూ–‘‘ఇప్పటివరకు నేను చేసిన ΄పాత్రల్లో ఈ చిత్రంలో చేసిన సుమతి నాకు బాగా ఇష్టమైన ΄పాత్ర’’ అన్నారు. ‘‘బ్యాంకింగ్‌ నేపథ్యంలో కుటుంబ భావోద్వేగాలతో నడిచే ఈ చిత్రం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుంది’’ అని సూర్యదేవర నాగవంశీ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement