సక్సెస్‌ అంటే... | Sri Sri Sri Rajavaru Movie Trailer Launch | Sakshi
Sakshi News home page

సక్సెస్‌ అంటే...

Jun 1 2025 3:02 AM | Updated on Jun 1 2025 9:15 AM

Sri Sri Sri Rajavaru Movie Trailer Launch

నార్నే నితిన్‌ హీరోగా సతీష్‌ వేగేశ్న తెరకెక్కించిన చిత్రం ‘శ్రీ శ్రీ శ్రీ రాజావారు’. ఈ సినిమాలో సంపద హీరోయిన్‌. చింతపల్లి రామారావు, ఎం. సుబ్బారెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 6న విడుదల కానుంది.

హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ చిత్రం ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో సతీష్‌ వేగేశ్న మాట్లాడుతూ– ‘‘మనల్ని మనం జయించుకోవడమే సక్సెస్‌ అంటే అనే కాన్సెప్ట్‌తో ఈ సినిమాను రూపొందించాం. ఈ సినిమా ప్రేక్షకులను నిరాశపర్చదు’’ అన్నారు. ‘‘గ్రామీణ నేపథ్యంలో సాగే వైవిధ్యమైన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ఇది. ఎన్టీఆర్‌గారు ఎంతో మెచ్చి, ఈ కథను ఎంపిక చేశారు’’ అన్నారు చింతపల్లి రామారావు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement