కృష్ణగారు యాక్షన్‌ సినిమాలు చేయమనేవారు: సుధీర్‌బాబు | Sakshi
Sakshi News home page

కృష్ణగారు యాక్షన్‌ సినిమాలు చేయమనేవారు: సుధీర్‌బాబు

Published Fri, May 31 2024 3:40 AM

Mahesh Babu to launch Sudheer Babu Harom Hara trailer

‘‘సూపర్‌స్టార్‌ కృష్ణగారి జయంతి (మే 31) సందర్భంగా ‘హరోం హర’ మూవీ ట్రైలర్‌ని లాంచ్‌ చేయడం హ్యాపీగా ఉంది. యాక్షన్‌ సినిమాలు చేయమని కృష్ణగారు చెప్పే వారు. ‘హరోం హర’ విషయంలో ఆయన ఆనందపడతారని నమ్ముతున్నాను. తెలుగు, ఇండియన్‌ సినిమాలో ఇప్పటివరకూ ‘హరోం హర’లాంటి నేపథ్యం ఉన్న సినిమా రాలేదనుకుంటున్నాను’’ అన్నారు సుధీర్‌బాబు. జ్ఞానసాగర్‌ ద్వారక దర్శకత్వంలో సుధీర్‌బాబు, మాళవికా శర్మ జంటగా నటించిన చిత్రం ‘హరోం హర’. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్‌ బ్యానర్‌పై సుమంత్‌ జి. నాయుడు నిర్మించారు.

ఈ సినిమా ట్రైలర్‌ను హీరో మహేశ్‌బాబు గురువారం సోషల్‌ మీడియాలో రిలీజ్‌ చేసి, ‘ట్రైలర్‌ ఆసక్తిగా ఉంది. సుధీర్‌బాబు, టీమ్‌కు శుభాకాంక్షలు’ అన్నారు. అనంతరం నిర్వహించిన ట్రైలర్‌ లాంచ్‌ వేడుకకి దర్శకులు అనిల్‌ రావిపూడి, సంపత్‌ నంది అతిథులుగా హాజరయ్యారు. సుధీర్‌బాబు మాట్లాడుతూ–‘‘హరోం హర’లో హీరో పాత్ర గురించి సింగిల్‌ లైన్‌లో చెప్పాలంటే జేమ్స్‌ బాండ్‌ ఇన్‌ కుప్పం లేదా రాంబో ఇన్‌ కుప్పం అనొచ్చు’’ అన్నారు.

‘‘ఈ సినిమా సుధీర్‌ కెరీర్‌లో బిగ్గెస్ట్‌ హిట్టవుతుంది’’ అన్నారు అనిల్‌ రావిపూడి. ‘‘ఈ మూవీ ట్రైలర్‌ టెరిఫిక్‌గా అనిపించింది’’ అన్నారు సంపత్‌ నంది. ‘‘హరోం హర’లో రెండు వేల మందితో షూట్‌ చేసిన ఓ సీక్వెన్స్‌ థియేటర్స్‌లో అద్భుతంగా ఉంటుంది’’ అన్నారు జ్ఞానసాగర్‌ ద్వారక. ‘‘నేనిప్పటివరకూ చేయని పాత్రను ఈ సినిమాలో చేశాను’’ అన్నారు మాళవికా శర్మ. ‘‘మా సినిమా అందర్నీ ఎంటర్‌టైన్‌ చేస్తుంది’’ అన్నారు సుమంత్‌ జి. నాయుడు. నిర్మాతలు సుబ్రహ్మణ్యం, కేఎల్‌ దామోదర్‌ ప్రసాద్, బెక్కం వేణుగోపాల్, సంగీత దర్శకుడు చేతన్‌ భరద్వాజ్‌ పాల్గొన్నారు.  

Advertisement
 
Advertisement
 
Advertisement