పొట్టేల్‌ రియల్‌పాన్‌ ఇండియన్‌ మూవీ: సంయుక్తా మీనన్‌ | Samyuktha Menon at Pottel Trailer Launch Event | Sakshi
Sakshi News home page

పొట్టేల్‌ రియల్‌పాన్‌ ఇండియన్‌ మూవీ: సంయుక్తా మీనన్‌

Oct 19 2024 3:46 AM | Updated on Oct 19 2024 3:46 AM

Samyuktha Menon at Pottel Trailer Launch Event

‘‘పొట్టేల్‌’ సినిమా ట్రైలర్‌ చాలా బాగుంది. ఈ కథ మీద డైరెక్టర్‌ సాహిత్‌ నాలుగేళ్లు పని చేయడం మామూలు విషయం కాదు. మంచి రైటింగ్, డైరెక్షన్‌ ఉంటేనే ఇంత అద్భుతమైన సినిమా తెరపైకి వస్తుంది. ఈ ట్రైలర్‌లో ఫస్ట్‌ షాట్‌ చూసినప్పుడు ఒక రియల్‌పాన్‌ ఇండియన్‌ ఫిల్మ్‌లా అనిపించింది’’ అని హీరోయిన్‌ సంయుక్తా మీనన్‌ అన్నారు. యువ చంద్రకృష్ణ, అనన్య నాగళ్ల లీడ్‌ రోల్స్‌లో అజయ్‌ కీలకపాత్రలో నటించిన రూరల్‌ యాక్షన్‌ డ్రామా ‘పొట్టేల్‌’. సాహిత్‌ మోత్కూరి దర్శకత్వం వహించారు. 

నిశాంక్‌ రెడ్డి కుడితి, సురేష్‌ కుమార్‌ సడిగే నిర్మించిన ఈ సినిమా ఈ నెల 25న విడుదలవుతోంది. ఈ చిత్రం ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా హాజరైన సంయుక్తా మీనన్‌ మాట్లాడుతూ– ‘‘నిశాంక్‌గారు ఈ సినిమా గురించి చెప్పినప్పుడు చాలా ΄ప్యాషన్‌నేట్‌ ప్రోడ్యూసర్‌ అనిపించింది. ఇలాంటి ΄ప్యాషన్‌ ఉన్న నిర్మాతలు పరిశ్రమకి కావాలి’’ అన్నారు. 

అనన్య నాగళ్ల మాట్లాడుతూ– ‘‘ట్రైలర్‌లో చూసింది ఒక శాతం మాత్రమే. ఈ చిత్రంలో గొప్ప కథ ఉంది’’ అని చెప్పారు. ‘‘చాలా ప్రేమించి ఈ చిత్రం చేశాం’’ అన్నారు యువ చంద్రకృష్ణ. ‘‘ప్రేక్షకుల స్పందన కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నాను’’ అని సాహిత్‌ మోత్కూరి పేర్కొన్నారు. ‘‘మంచి కంటెంట్‌తో నిర్మించిన ఈ చిత్రం పెద్ద సౌండ్‌ చేయబోతోంది. సాహిత్‌ అద్భుతంగా తీశాడు’’ అని నిశాంక్‌ రెడ్డి కుడితి, సురేష్‌ కుమార్‌ సడిగే తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement