బాపు అరుదైన సినిమా: రానా దగ్గుబాటి | Baapu Movie Trailer Launch Event | Sakshi
Sakshi News home page

బాపు అరుదైన సినిమా: రానా దగ్గుబాటి

Feb 14 2025 1:38 AM | Updated on Feb 14 2025 1:38 AM

Baapu Movie Trailer Launch Event

∙దయా, బ్రహ్మాజీ, రానా, తిరువీర్‌

రెగ్యులర్‌కి భిన్నంగా ఉండే ‘బాపు’లాంటి సినిమాలు రావడం చాలా అరుదు. ఒక సంస్కృతిని చూపించే ఇలాంటి చిత్రాన్ని చూసేందుకు ప్రేక్షకుల్లా నేను కూడా ఆత్రుతగా ఎదురు చూస్తున్నాను’’ అని హీరో రానా దగ్గుబాటి(Rana Daggubati ) అన్నారు. బ్రహ్మాజీ(Brahmaji) లీడ్‌ రోల్‌లో నటించిన చిత్రం ‘బాపు’(Bapu). దయా దర్శకత్వంలో కామ్రేడ్‌ ఫిల్మ్‌ ఫ్యాక్టరీ బ్యానర్‌పై రాజు, సీహెచ్‌ భాను ప్రసాద్‌ రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 21న విడుదల కానుంది.

హైదరాబాద్‌లో నిర్వహించిన ‘బాపు’ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌కి రానా దగ్గుబాటి, నటుడు తిరువీర్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తిరువీర్‌ మాట్లాడుతూ– ‘‘బాపు’ ట్రైలర్‌లో మట్టివాసన కనిపించింది. దయాగారు చాలా మంచి సినిమా తీశారు’’ అన్నారు. ‘‘మన కుటుంబంలోని పాత్రలు ఈ సినిమాలో కనిపిస్తాయి.

ఈ మూవీని అందరం ్రపోత్సహిద్దాం’’ అని దర్శక–నిర్మాత ‘మధుర’ శ్రీధర్‌ పేర్కొన్నారు. ‘‘బాపు’ మంచి కంటెంట్‌ ఉన్న సినిమా. ఈ చిత్రానికి మంచి పేరు రావాలి’’ అన్నారు బ్రహ్మాజీ. ‘‘మా చిత్రాన్ని అందరూ థియేటర్స్‌లో చూడాలి’’ అని దయా కోరారు. ‘‘నా కెరీర్‌లో చాలా ప్రత్యేకమైన సినిమా ‘బాపు’’ అన్నారు సంగీత దర్శకుడు ఆర్‌ఆర్‌ ధ్రువన్‌.

Advertisement
 
Advertisement
Advertisement