
‘‘సుందరకాండ’ చిత్రం ట్రైలర్‌ను లాంచ్ చేసిన ప్రభాస్‌గారికి థ్యాంక్స్. మా మూవీ ట్రైలర్, పాటలకి చాలా మంచి స్పందన వచ్చింది. మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమాని కుటుంబమంతా చూడొచ్చు. వినాయక చవితికి మా చిత్రం విడుదలవుతుండటం సంతోషంగా ఉంది. నటీనటులు, సాంకేతిక నిపుణులందరికీ ఈ సినిమా మంచి జ్ఞాపకంలా ఉంటుంది’’ అని నారా రోహిత్ చెప్పారు.
వెంకటేశ్ నిమ్మలపూడి దర్శకత్వంలో నారా రోహిత్, వృతి వాఘాని, శ్రీదేవి విజయ్ కుమార్ లీడ్ రోల్స్‌లో నరేశ్ విజయకృష్ణ, వాసుకి ఆనంద్ ఇతర పాత్రలుపోషించిన చిత్రం ‘సుందరకాండ’. సంతోష్ చిన్నపొల్ల, గౌతమ్ రెడ్డి, రాకేశ్ మహంకాళి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 27న విడుదల కానుంది. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో నిర్వహించిన సమావేశంలో శ్రీదేవి విజయ్‌కుమార్ మాట్లాడుతూ–‘‘చాలా కాలం తర్వాత ‘సుందరకాండ’ లాంటి సినిమా చేయడం చాలా ఆనందాన్నిచ్చింది.
మంచి వినోదాత్మక చిత్రమిది... అందరూ సంతోషంగా చూడొచ్చు’’ అన్నారు. ‘‘నా తొలి సినిమా వినాయక చవితి పండగ రోజు రిలీజ్ అవడం సంతోషంగా ఉంది. మా చిత్రం అందరికీ నచ్చుతుందనుకుంటున్నాను’’ అన్నారు వెంకటేశ్ నిమ్మలపూడి. ‘‘మా సినిమాని చూసి, మా యూనిట్‌ని ఆశీర్వదించాలి’’ అని సంతోష్ చిన్నపొల్ల పేర్కొన్నారు. ‘‘సుందరకాండ’ లాంటి రొమాంటిక్ కామెడీ మూవీ ఇప్పటివరకు రాలేదు.. ఈ సినిమా అందర్నీ అలరిస్తుంది’’ అన్నారు నరేశ్ విజయకృష్ణ. నటి వాసుకి మట్లాడారు.