breaking news
sundarakanda
-
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 27 సినిమాలు
మరోవారం వచ్చేసింది. ఈసారి థియేటర్లలోకి పవన్ కల్యాణ్ 'ఓజీ' మూవీ రానుంది. మరి ఎలాంటి ఫలితం అందుకుంటుందో చూడాలి? మరోవైపు ఓటీటీల్లో 27 సినిమాలు, వెబ్ సిరీసులు రానున్నాయి. ఈ వీకెండ్ తెలుగు స్ట్రెయిట్ చిత్రాలతో పాటు పలు డబ్బింగ్‌లు కూడా ఉండటం ఆసక్తి రేపుతోంది.(ఇదీ చదవండి: 'ఓజీ'.. జస్ట్ మిస్ అయింది)ఓటీటీల్లో రిలీజయ్యే వాటి విషయానికొస్తే.. జూనియర్, సుందరకాండ లాంటి స్ట్రెయిట్ సినిమాలతో పాటు హృదయపూర్వం, ఒడుమ్ కుతిరా చడుమ్ కుతిరా, సుమతి వళవు తదితర డబ్బింగ్ చిత్రాలు రాబోతున్నాయి. వీటిపై కాస్తంత ఆసక్తి ఉండనే ఉంది. ఇవే కాకుండా వీకెండ్లో సడన్ సర్ప్రైజ్లు ఏమైనా ఉండొచ్చేమో చూడాలి? ఇంతకీ ఏ ఓటీటీలో ఏ మూవీ స్ట్రీమింగ్ కానుందంటే?ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాలు (సెప్టెంబరు 21 నుంచి 28 వరకు)ఆహాజూనియర్ (తెలుగు సినిమా) - సెప్టెంబరు 22అమెజాన్ ప్రైమ్హోటల్ కాస్టైరా (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబరు 24కొకైనా క్వార్టర్ బ్యాక్ (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబరు 25టూమచ్ విత్ కాజల్ అండ్ ట్వింకిల్ (హిందీ టాక్ షో) - సెప్టెంబరు 25మాదేవా (కన్నడ సినిమా) - సెప్టెంబరు 26నెట్ఫ్లిక్స్ఒడుమ్ కుతిరా చడుమ్ కుతిరా (తెలుగు డబ్బింగ్ మూవీ) - సెప్టెంబరు 26ది గెస్ట్ (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబరు 26అలైస్ (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబరు 26మాంటిస్ (ఇంగ్లీష్ సినిమా) - సెప్టెంబరు 26హౌస్ ఆఫ్ గిన్నీస్ (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబరు 26హాట్స్టార్సుందరకాండ (తెలుగు సినిమా) - సెప్టెంబరు 23ది డెవిల్ ఈజ్ బిజీ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ) - సెప్టెంబరు 24హృదయపూర్వం (తెలుగు డబ్బింగ్ మూవీ) - సెప్టెంబరు 26మార్వెల్ జాంబియాస్ (ఇంగ్లీష్ సినిమా) - సెప్టెంబరు 24ద బల్లాడ్ ఆఫ్ వల్లిస్ ఐలాండ్ (ఇంగ్లీష్ చిత్రం) - సెప్టెంబరు 28ఉమన్ ఇన్ ద యార్డ్ (ఇంగ్లీష్ సినిమా) - సెప్టెంబరు 28ద ఫ్రెండ్ (ఇంగ్లీష్ చిత్రం) - సెప్టెంబరు 28డెత్ ఆఫ్ ఏ యూనికార్న్ (ఇంగ్లీష్ సినిమా) - సెప్టెంబరు 28సన్ నెక్స్ట్దూరతీర యానా (కన్నడ మూవీ) - సెప్టెంబరు 26జీ5జనావర్ (హిందీ సిరీస్) - సెప్టెంబరు 26సుమతి వళవు (తెలుగు డబ్బింగ్ సినిమా) - సెప్టెంబరు 26ఆపిల్ ప్లస్ టీవీస్లో హార్సస్ సీజన్ 5 (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబరు 24ఆల్ ఆఫ్ యూ (ఇంగ్లీష్ మూవీ) - సెప్టెంబరు 26ద సావంత్ (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబరు 26లయన్స్ గేట్ ప్లేడేంజరస్ యానిమల్స్ (ఇంగ్లీష్ సినిమా) - సెప్టెంబరు 26మనోరమ మ్యాక్స్సర్తీక్ (మలయాళ మూవీ) - సెప్టెంబరు 26ఎమ్ఎక్స్ ప్లేయర్సిక్సర్ సీజన్ 2 (హిందీ సిరీస్) - సెప్టెంబరు 24(ఇదీ చదవండి: మనీష్ ఎలిమినేట్.. రెండువారాల సంపాదన ఎంతంటే?) -
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
లేటెస్ట్ తెలుగు సినిమా నెలలోపే ఓటీటీలోకి వచ్చేందుకు సిద్దమైంది. నారా రోహిత్, శ్రీదేవి విజయ్ కుమార్, వర్తి వాఘని హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం.. మొన్నమొన్ననే థియేటర్లలోకి వచ్చింది. ఇప్పుడు డిజిటల్ ప్రేక్షకుల్ని అలరించేందుకు రెడీ అయిపోయింది. ఈ క్రమంలోనే అధికారికంగానూ ప్రకటించారు. ఇంతకీ ఈ సినిమా సంగతేంటి? ఏ ఓటీటీలోకి రానుంది?గత కొన్నేళ్లుగా నటనకు దూరంగా ఉన్న నారా రోహిత్.. ఈ ఏడాది 'భైరవం' మూవీతో వచ్చాడు. కానీ ఫలితం డిసప్పాయింట్ చేసింది. గత నెల 27న 'సుందరకాండ' అనే సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించాడు. కామెడీ వర్కౌట్ అయింది అనే టాక్ వచ్చింది గానీ దీన్ని కూడా ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు ఈ చిత్రాన్ని ఈనెల 23 నుంచి హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీలో అందుబాటులోకి రానుంది.(ఇదీ చదవండి: ఎట్టకేలకు ఓటీటీలోకి 'జూనియర్' సినిమా)'సుందరకాండ' విషయానికొస్తే.. సిద్ధార్థ్ (నారా రోహిత్) 30 ఏళ్లు దాటిపోయి చాన్నాళ్లయినా సరే పెళ్లి చేసుకోడు. స్కూల్లో చదువుకునేటప్పుడు తన సీనియర్ వైష్ణవి(శ్రీదేవి)ని ప్రేమిస్తాడు. ఆమెలోని కొన్ని లక్షణాలు ఇతడికి నచ్చుతాయి. పెద్దయిన తర్వాత అలాంటి లక్షణాలున్న అమ్మాయినే పెళ్లి చేసుకుంటానని తనకు తానే రూల్ పెట్టుకుంటాడు. సంబంధాలు వస్తుంటాయి, అమ్మాయిల్ని చూస్తుంటాడు కానీ అందరినీ రిజెక్ట్ చేస్తుంటాడు.ఓసారి ఎయిర్‌పోర్ట్‌లో ఐరా(వృతి వాఘని) అనే అమ్మాయిలో తను అనుకున్న క్వాలిటీస్ ఉన్నాయని సిద్దార్థ్ ఆమె వెంటపడతాడు. తనని ప్రేమించేలా చేస్తాడు. మరి ఈ ప్రేమకథ సుఖాంతమైందా? సిద్ధార్థ్ మళ్లీ వైష్ణవిని ఎందుకు కలవాల్సి వచ్చిందనేది మిగతా స్టోరీ. అయితే ఇందులో హీరో.. తల్లికూతురిని ప్రేమించడం అనే కాన్సెప్ట్ కాస్త విడ్డూరంగా ఉంటుంది. సత్య కామెడీ వర్కౌట్ అయినప్పటికీ.. ఈ కాన్సెప్ట్ ఓకే అనుకుంటేనే దీన్ని చూడండి.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాలు ఇవే) -
‘దిల్’ రాజు బేనర్ సినిమాలా...
‘‘సుందరకాండ’ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తున్నందుకు సంతోషంగా ఉంది. సత్య క్యారెక్టర్‌తో నాకు మంచి పేరు వచ్చింది. వెంకీ రాసిన డైలాగ్స్ గురించి ప్రత్యేకంగా చెబుతున్నారు. ఇంకా చూడనివాళ్ళు, థియేటర్స్‌కి వెళ్లి, మా సినిమా చూడండి’’ అని నారా రోహిత్ అన్నారు. నారా రోహిత్ హీరోగా, వృతి వాఘాని, శ్రీదేవి విజయ్ కుమార్ హీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం ‘సుందరకాండ’. వెంకటేశ్ నిమ్మలపూడి దర్శకత్వంలో సంతోష్ చిన్న పొల్ల, గౌతమ్ రెడ్డి, రాకేశ్ మహంకాళి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 27న విడుదలైంది. ఈ సందర్భంగా శుక్రవారం నిర్వహించిన థ్యాంక్స్ మీట్లో వెంకటేశ్ నిమ్మలపూడి మాట్లాడుతూ– ‘‘నా రైటింగ్‌కు మంచి ప్రశంసలు వస్తున్నందుకు సంతోషంగా ఉంది’’ అన్నారు.‘‘దిల్’ రాజుగారి బేనర్ నుంచి వచ్చినట్టు మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ తీశారని చెబుతుంటే ఆనందంగా ఉంది’’ అని చె ప్పారు నిర్మాత సంతోష్. ‘‘ఈ సినిమా విషయంలో మేం ఎంత ఎగ్జయిట్ అయ్యామో, ఆడియన్స్ కూడా ఈ సినిమా చూసి అంతే ఎగ్జయిట్ కావడం సంతోషాన్నిస్తోంది’’ అని పేర్కొన్నారు రాకేశ్. -
నారా రోహిత్ 'సుందర కాండ' సక్సెస్ మీట్ (ఫోటోలు)
-
'సుందరకాండ' సినిమా రివ్యూ
ప్రభాస్ తొలి సినిమాలో హీరోయిన్ శ్రీదేవి.. చాలా ఏళ్ల తర్వాత తెలుగులో హీరోయిన్గా చేసిన మూవీ 'సుందరకాండ'. నారా రోహిత్ హీరో కాగా, వృతి వాఘని మరో కథానాయిక. చాన్నాళ్ల క్రితమే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. ఇన్నాళ్లకు థియేటర్లలోకి వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? హిట్టా ఫట్టా అనేది రివ్యూలో చూద్దాం.కథేంటి?సిద్ధార్థ్ (నారా రోహిత్) 30 ఏళ్ల వయసు దాటిపోయి చాన్నాళ్లయినా పెళ్లి చేసుకోడు. స్కూల్లో చదువుకునేటప్పుడు తన సీనియర్ వైష్ణవి(శ్రీదేవి)ని ప్రేమిస్తాడు. ఆమెలోని కొన్ని లక్షణాలు నచ్చుతాయి. పెద్దయిన తర్వాత అలాంటి లక్షణాలున్న అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని రూల్ పెట్టుకుంటాడు. సంబంధాలు వస్తుంటాయి, అమ్మాయిల్ని చూస్తుంటాడు కానీ ప్రతి ఒక్కరిని రిజెక్ట్ చేస్తుంటాడు. ఓసారి ఎయిర్‌పోర్ట్‌లో ఐరా(వృతి వాఘని) అనే అమ్మాయిలో తను అనుకున్న క్వాలిటీస్ ఉన్నాయని ఆమె వెంటపడతాడు. తనని ప్రేమించేలా చేస్తాడు. మరి ఈ ప్రేమకథ సుఖాంతమైందా? సిద్ధార్థ్ మళ్లీ వైష్ణవిని ఎందుకు కలవాల్సి వచ్చిందనేది మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?టాలీవుడ్లో ఇప్పటికే వందలాది ప్రేమకథ సినిమాలు వచ్చాయి, వస్తున్నాయి. కానీ ఇందులోనూ కొత్తగా చెప్పేందుకు ఆస్కారం ఉంటుంది. అలాంటి పాయింట్స్‌ని స్టోరీగా రాసి మూవీగా తీస్తుంటారు. ఇది కూడా అలాంటి ఓ చిత్రమే. కాన్సెప్ట్ వినడానికే విడ్డూరంగా ఉంటుంది గానీ గీత దాటకుండా బాగానే తీశారు. కామెడీ బోనస్.సిద్ధార్థ్ పెళ్లి చేసేందుకు అతడి కుటుంబం.. అమ్మాయిల్ని చూడటంతో సినిమా మొదలవుతుంది. అలా తను అనుకున్న లక్షణాలు లేవవి రిజెక్ట్ చేస్తూ వెళ్తుంటాడు. ఓ సందర్భంలో ఎయిర్‌పోర్ట్‌లో ఐరాని చూస్తాడు. ఆమెలో క్వాలిటీస్.. తను అనుకున్న వాటికి మ్యాచ్ అవుతున్నాయని తెలిసి ఆమె వెంటపడి తనని ప్రేమించేలా చేస్తాడు. అంతా సుఖాంతం అనుకునే టైంలో ఓ ట్విస్ట్. అలా ఇంటర్వెల్ పడుతుంది. సిద్దార్థ్ చిన్నప్పుడు ఇష్టపడ్డ వైష్ణవి అనే క్యారెక్టర్ ఈ కథలోకి ఎంటర్ అవుతుంది. తర్వాత ఏమైంది? సిద్ధార్థ్ తన ప్రేమకథకి ఎలా ముగింపు ఇచ్చాడనేది మూవీ చూసి తెలుసుకోవాలి.సినిమా ఎలా ఉంది అంటే జస్ట్ బాగుంది. ఫస్టాప్ అంతా పెద్దగా మెరుపులేం ఉండవు. హీరో పరిచయం, అతడికో ఫ్లాష్ బ్యాక్, హీరోయిన్‌తో లవ్ ట్రాక్.. ఇలా బోర్ కొట్టకుండా సాగిపోతుంది. ఇంటర్వెల్లో ఓ ట్విస్ట్ ఉంటుంది. అయితే ఫస్టాప్ చూస్తున్నప్పుడే దీన్ని చాలామంది ఊహించేస్తారు. అయితే ఈ ట్విస్ట్‌కి తగ్గట్లు సెకండాఫ్‌లో సీన్లు ఉన్నాయా అంటే కొన్ని ఉన్నాయి అంతే. మిగతా అంతా సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది. క్లైమాక్స్ అయితే హడావుడిగా అనిపిస్తుంది.ఇలాంటి కాన్సెప్ట్ సినిమాలో చాలానే డ్రామా నడిపించొచ్చు. కావాల్సినంత స్కోప్ కూడా ఉంది. కానీ ఎందుకో చేయలేకపోయారు అనిపించింది. కొంతలో కొంత సత్య కామెడీ ట్రాక్ రిలీఫ్‌గా అనిపిస్తుంది. పాటలు, ఫైట్స్ లాంటివి సినిమాటిక్‌గా ఉన్నాయి తప్పితే కథలో సెట్ కాలేదనిపించింది.ఎవరెలా చేశారు?నారా రోహిత్ ఎప్పటిలానే చేశాడు కానీ ఫిజిక్ పరంగా ఇంకాస్త శ్రద్ధ తీసుకోవాలి. డ్యాన్స్ చేశాడు కానీ ఇబ్బందిపడుతున్నట్లు అనిపించింది. చాన్నాళ్ల తర్వాత తెలుగులో చేసిన శ్రీదేవి ఆకట్టుకుంది. ఈమె పాత్రకు ఇంకొన్ని సీన్స్ పడుంటే బాగుండేది. స్కూల్ లవ్ స్టోరీలోనూ ఈమెనే పెట్టేశారు. బదులుగా ఎవరైనా చైల్డ్ ఆర్టిస్టుని పెట్టుంటే బాగుండేదేమో! ఐరా రోల్ చేసిన వృతి చూడటానికి బాగుంది. యాక్టింగ్ కూడా బాగానే చేసింది. సత్య, వాసుకీ, సీనియర్ నరేశ్ ఎవరికి వారు తమ పాత్రలకు న్యాయం చేశారు.టెక్నికల్ అంశాలకొస్తే సినిమాటోగ్రఫీ రిచ్‌గా ఉంది. లియోన్ జేమ్స్ పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగానే ఉంది గానీ ఎక్కడో విన్న ఫీలింగ్ కలిగింది. దర్శకుడు వెంకటేశ్ తను అనుకున్న పాయింట్ బాగానే ప్రెజెంట్ చేశాడు కానీ ప్రేక్షకులు దీన్ని ఏ మేరకు అంగీకరిస్తారనేది చూడాలి.- చందు డొంకాన -
ఎన్నో ఒడుదొడుకులు ఉంటాయి: మంచు మనోజ్
‘‘ఓ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం అంత సులభం కాదు. దాని వెనుక ఎంతో మంది శ్రమ ఉంటుంది. ఇండస్ట్రీలో పనిచేసే వారిని సినిమా వాళ్లులే అని చాలామంది సులభంగా అనేస్తారు. దాని వెనుక ఎన్నో త్యాగాలు, మరెన్నో ఒడుదొడుకులు ఉంటాయి. వాటిని దాటుకొని రాగలిగితేనే ఇక్కడ ఉండగలం’’ అని హీరో మంచు మనోజ్ చెప్పారు. నారా రోహిత్ హీరోగా, వృతి వాఘాని, శ్రీదేవి విజయ్ కుమార్ హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘సుందరకాండ’. వెంకటేష్ నిమ్మలపూడి దర్శకత్వంలో సంతోష్ చిన్నపొల్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా హాజరైన మంచు మనోజ్ మాట్లాడుతూ–‘‘సుందర కాండ’ చిత్రానికి ప్రేక్షకులు గొప్ప విజయం అందించాలి’’ అని కోరారు. ‘‘ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో కలిసి మా సినిమా చూసి, మమ్మల్ని ఆశీర్వదించండి’’ అని నారా రోహిత్ పేర్కొన్నారు. ‘‘మా మూవీ చూసి ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాం’’ అని సంతోష్ చిన్నపొల్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి తెలిపారు. -
కాబోయే సతీమణితో వేడుకలో పాల్గొన్న నారా రోహిత్ (ఫోటోలు)
-
సుందరకాండ చాలా కొత్త కథ: నారా రోహిత్
‘‘సుందరకాండ’ చాలా క్లీన్ ఫిలిం. 30 ఏళ్లు దాటినా కూడా కావాల్సిన అర్హతలున్న అమ్మాయి కోసం హీరో వెతకడం అనేది చాలా ఆసక్తిగా ఉంటుంది. నా క్యారెక్టర్లో కొత్త ఎగ్జిట్ ఉంది.. ఈ పాత్రని చాలా ఎంజాయ్ చేశాను.. నేటి తరానికి ఇది చాలా కొత్త కథ. అన్ని వర్గాల వారికి కనెక్ట్ అవుతుంది’’ అని నారా రోహిత్ చెప్పారు. వెంకటేష్ నిమ్మలపూడి దర్శకత్వంలో నారా రోహిత్ హీరోగా, వృతి వాఘాని, శ్రీదేవి విజయ్ కుమార్ హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘సుందరకాండ’. సందీప్ పిక్చర్ ఫ్యాలెస్పై సంతోష్ చిన్న పోల్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 27న విడుదల కానుంది.ఈ సందర్భంగా నారా రోహిత్ విలేకరులతో మాట్లాడుతూ– ‘‘2022లోనే ‘సుందరకాండ’ స్క్రిప్ట్ వర్క్ ఆరంభించాం. వెంకటేష్ అద్భుతమైన కథ రాశాడు. ఈ సినిమా నాప్రోడక్షన్లోనే స్టార్ట్ చేశాను. అయితే నా కజిన్ సంతోష్, గౌతమ్, రాకేష్.. ఈ కథ నచ్చి నిర్మాణంలో భాగమయ్యారు. లియాన్ జేమ్స్ మంచి పాటలు, నేపథ్య సంగీతం ఇచ్చారు’’ అని తెలిపారు. -
కామెడీ రాయడం కష్టం
నారా రోహిత్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘సుందరకాండ’. ఈ చిత్రంలో వృతి వాఘాని, శ్రీదేవి విజయ్ కుమార్ హీరోయిన్లుగా నటించారు. వెంకటేశ్ నిమ్మలపూడి దర్శకత్వంలో సంతోష్ చిన్నపొల్ల, గౌతమ్ రెడ్డి, రాకేశ్ మహంకాళి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 27న విడుదల కానుంది. ఈ సందర్భంగా శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో వెంకటేశ్ నిమ్మలపూడి మాట్లాడుతూ– ‘‘దర్శకుడిగా నాకు ‘సుందరకాండ’ తొలి చిత్రం. పూర్తి వినోదాత్మక చిత్రం ఇది. ఈ రోజుల్లో ఓ అబ్బాయికి 30 ఏళ్ల వయసు దాటాక పెళ్లి కాకపోవడమే పెద్ద పంచాయితీ అనుకుంటే, ఆ అబ్బాయి నాకు ఫలానా ప్రత్యేక లక్షణాలు ఉన్న అమ్మాయే కావాలని పట్టుబడితే ఏంటి? అన్నదే ఈ సినిమా కథ. రెండు డిఫరెంట్ ఏజ్ గ్రూపు ఉన్న లవ్ స్టోరీ ఇది. హీరో పాత్రకు ఎక్కువ వయసు ఉన్న అమ్మాయి పాత్ర కోసం శ్రీదేవి విజయ్కుమార్గారిని, హీరో కంటే తక్కువ వయసున్న పాత్ర కోసం వృతి వాఘానిని తీసుకున్నాం. నాకు కామెడీ కథలంటే ఇష్టం. అయితే కామెడీ రాయడం కష్టం. ఈ సినిమాలో క్లీన్ కామెడీ ఉంటుంది. లక్కీగా ఈ సినిమాలో అందరూ కామెడీ బాగా చేయగలిగినవారే ఉన్నారు. బాగా చేశారు’’ అని అన్నారు. -
ప్రభాస్ ఫస్ట్ హీరోయిన్ శ్రీదేవి విజయ్ కుమార్ (ఫోటోలు)
-
ఆ ఫోటోలు నాకు మంచి జ్ఞాపకాలు: శ్రీదేవి విజయ్‌కుమార్
‘‘సుందరకాండ’ మంచి వినోదాత్మక చిత్రం. కథ వినగానే షాక్ అయ్యాను. ఈ చిత్రంలో నేను చాలా మంచి బలమైనపాత్ర చేశాను. అందరూ థియేటర్స్‌కి వెళ్లిచూడొచ్చు’’ అని హీరోయిన్ శ్రీదేవి విజయ్‌కుమార్ తెలిపారు. నారా రోహిత్ హీరోగా వెంకటేష్ నిమ్మలపూడి దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘సుందరకాండ’. శ్రీదేవి విజయ్ కుమార్, వృతి వాఘాని హీరోయిన్లుగా నటించారు. సంతోష్ చిన్నపొల్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 27న విడుదల కానుంది. ఈ సందర్భంగా శ్రీదేవి విజయ్‌కుమార్ విలేకరులతో మాట్లాడుతూ–‘‘కొంత గ్యాప్ తర్వాత మళ్లీ వెండితెరపై నన్ను నేను చూసుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నేను హీరోయిన్ గా చేస్తున్న రోజుల్లోనే పెళ్లి చేసుకుని, ఓపాపకి జన్మనిచ్చాను. ఆ తర్వాత కొన్ని టీవీ ప్రోగ్రామ్స్ చేశాను. ఇప్పుడు నా కుమర్తె స్కూల్‌కు వెళుతోంది. సో.. నేను మళ్లీ సినిమాలతో బిజీ అవ్వాలనుకుంటున్నాను.ఈ సినిమాలో నేను స్కూల్ డ్రెస్‌లో కనిపించే సన్నివేశం ఉంది. ఈ సీన్ కోసం చాలా కష్టపడ్డాను. డైట్ ఫాలో అయ్యాను. నా కుమార్తె, నేను స్కూల్ డ్రెస్‌లో ఉన్న ఫోటోలు నా దగ్గర ఉన్నాయి.. ఇవి నాకు మంచి జ్ఞాపకాలుగా ఉండిపోతాయి. ప్రభాస్‌గారి తొలి సినిమా ‘ఈశ్వర్’లో నేను హీరోయిన్ గా చేశాను.. తను పెద్ద స్టార్ అవుతాడని మేం అప్పుడే ఊహించాం.. మేం ఊహించినదాని కన్నా పెద్ద స్టార్ అయ్యారు’’ అని చెప్పారు. -
నారా రోహిత్ ‘సుందరకాండ’ మూవీ ప్రెస్‌మీట్ (ఫొటోలు)
-
ఓ మంచి జ్ఞాపకంలాంటి సినిమా
‘‘సుందరకాండ’ చిత్రం ట్రైలర్‌ను లాంచ్ చేసిన ప్రభాస్‌గారికి థ్యాంక్స్. మా మూవీ ట్రైలర్, పాటలకి చాలా మంచి స్పందన వచ్చింది. మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ సినిమాని కుటుంబమంతా చూడొచ్చు. వినాయక చవితికి మా చిత్రం విడుదలవుతుండటం సంతోషంగా ఉంది. నటీనటులు, సాంకేతిక నిపుణులందరికీ ఈ సినిమా మంచి జ్ఞాపకంలా ఉంటుంది’’ అని నారా రోహిత్ చెప్పారు. వెంకటేశ్ నిమ్మలపూడి దర్శకత్వంలో నారా రోహిత్, వృతి వాఘాని, శ్రీదేవి విజయ్ కుమార్ లీడ్ రోల్స్‌లో నరేశ్ విజయకృష్ణ, వాసుకి ఆనంద్ ఇతర పాత్రలుపోషించిన చిత్రం ‘సుందరకాండ’. సంతోష్ చిన్నపొల్ల, గౌతమ్ రెడ్డి, రాకేశ్ మహంకాళి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 27న విడుదల కానుంది. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో నిర్వహించిన సమావేశంలో శ్రీదేవి విజయ్‌కుమార్ మాట్లాడుతూ–‘‘చాలా కాలం తర్వాత ‘సుందరకాండ’ లాంటి సినిమా చేయడం చాలా ఆనందాన్నిచ్చింది.మంచి వినోదాత్మక చిత్రమిది... అందరూ సంతోషంగా చూడొచ్చు’’ అన్నారు. ‘‘నా తొలి సినిమా వినాయక చవితి పండగ రోజు రిలీజ్ అవడం సంతోషంగా ఉంది. మా చిత్రం అందరికీ నచ్చుతుందనుకుంటున్నాను’’ అన్నారు వెంకటేశ్ నిమ్మలపూడి. ‘‘మా సినిమాని చూసి, మా యూనిట్‌ని ఆశీర్వదించాలి’’ అని సంతోష్ చిన్నపొల్ల పేర్కొన్నారు. ‘‘సుందరకాండ’ లాంటి రొమాంటిక్ కామెడీ మూవీ ఇప్పటివరకు రాలేదు.. ఈ సినిమా అందర్నీ అలరిస్తుంది’’ అన్నారు నరేశ్ విజయకృష్ణ. నటి వాసుకి మట్లాడారు. -
ఆగస్టులో సుందరకాండ
నారా రోహిత్ హీరోగా నటించిన ‘సుందరకాండ’ చిత్రం ఆగస్టు 27న రిలీజ్ కానుంది. వెంకటేశ్ నిమ్మలపూడి దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రంలో వృతి వాఘాని, శ్రీదేవి విజయ్‌కుమార్ హీరోయిన్లు. సంతోష్ చిన్నపోళ్ల, గౌతమ్ రెడ్డి, రాకేశ్ మహంకాళి నిర్మించారు. జూలై 25న నారా రోహిత్ బర్త్‌డే సందర్భంగా ‘సుందరకాండ’ని ఆగస్టు 27న వినాయక చవితి సందర్భంగా విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది. ‘‘ఈ చిత్రంలో హీరో జీవితంలోని వివిధ దశల్లోని రెండు ప్రేమకథలను చూపిస్తున్నాం. శ్రీదేవితో మొదటి ప్రేమ, వృతి వాఘానితో కలిసి రెండో ప్రేమకథని ప్రేక్షకులు చూస్తారు’’ అని యూనిట్ పేర్కొంది. -
నారా రోహిత్ 'సుందరకాండ' టీజర్ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
వీళ్లు పెళ్లి వద్దంటున్నారు.. మాకు మాత్రం మరొకటి: నరేశ్
తెలుగు సీనియర్ నటుడు నరేశ్ పేరు చెప్పగానే పవిత్ర లోకేశ్ గుర్తొస్తుంది. ఎందుకంటే కొన్నాళ్ల క్రితం నుంచి ఈమెతోనే కలిసుంటున్నాడు. ఈ విషయమై నరేశ్ మూడో భార్య రమ్య రఘపతి అప్పట్లో బాహాటంగా గొడవపడటం, ఇదంతా కోర్టుల వరకు వెళ్లడం జరిగింది. ఇదంతా మీకే తెలిసే ఉంటుంది. అలాంటిది ఇప్పుడు ఓ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో మాట్లాడుతూ పెళ్లి గురించి మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.(ఇదీ చదవండి: ఓటీటీల్లో ఈ వారం ఏకంగా 15 చిత్రాలు రిలీజ్)'సుందరకాండ' అనే సినిమా టీజర్ తాజాగా రిలీజ్ చేశారు. దీని తర్వాత మీడియాతో చిట్ చాట్ చేశారు. ఈ క్రమంలోనే ఒకరు పెళ్లి చేసుకుంటే బెటరా? పెళ్లి చేసుకోకపోతే బెటరా అని నరేశ్‌ని అడగ్గా.. 'ఇప్పుడున్న జనరేషన్ ఏమో అసలు పెళ్లి వద్దు అంటున్నారు. మా జనరేషన్ ఏమో ఇంకోటి కావాలని అంటున్నారు' అని నవ్వుతూ సమాధానం చెప్పేశారు.నరేశ్ తన మూడో భార్య రమ్య రఘపతికి గత కొన్నాళ్లుగా దూరంగా ఉంటున్నారు. నటి పవిత్రతో కలిసి ఉంటున్నారని టాక్. ఈ క్రమంలోనే నరేశ్-పవిత్ర లోకేశ్ జంటగా గతేడాది 'మళ్లీ పెళ్లి' అనే సినిమా కూడా రావడం విశేషం. అలాంటిది ఇప్పుడు నరేశ్.. ప్రస్తుత యువత పెళ్లి ఆలోచనపై అలా సెటైర్ వేసేశారు.(ఇదీ చదవండి: ఈ వయసులో మూడో పెళ్లి కష్టమేమో! కానీ..: ఆమిర్ ఖాన్) -
ఈ కథే అందరిని కలిపింది టీజర్ నచ్చిందా..
-
‘బీజేపీకి ఆప్‌కు మధ్య తేడా ఎంటీ?’
అమ్ ఆద్మీ పార్టీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ చేసిన వ్యాఖ్యలపై ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ చీఫ్,హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవిండ్ కేజ్రీవాల్, రాష్ట్రం ప్రభుత్వం ప్రతి నెల మొదటి మంగళవారం సుందరకాండ, హనుమాన్ చాలీసా పఠించాలని నిర్ణయం తీసుకుంటే.. బీజేపీకి ఆప్ మధ్య తేడా ఏంటని ఆయన సూటిగా ప్రశ్నించారు. ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటే ఈ రెండు పార్టీల మధ్య ఏమాత్రం తేడా ఉండదని అన్నారు. ఢిల్లీలోని ప్రతి నియోజకవర్గంలో ప్రతి నెల మొదటి మంగళవారం సుందరకాండ, హనుమాన్ చాలీసా పఠించాలని ఢిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ సోమవారం ప్రకటించిన విషయం తెలిసిందే. సుందరకాండ, హనుమాన్ చాలీసా పఠించడానికి రానున్న రోజుల్లో సుమారు 2,600 ప్రాంతాలను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యపై స్పందించిన మజ్లిస్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సదరు మంత్రి తీవ్ర విమర్శలు చేశారు. ఆప్ తమను తాము గొప్పగా ఊహించుకుంటోందని అన్నారు. ప్రధాన మంత్రి మోదీ అనుసరిస్తున్న హిందుత్వ రాగాన్ని ఆప్ అమలు చేస్తోందని మండిడ్డారు. ఆప్‌లో కొంత మంది నేతలు తాము సరయు నదికి వెళ్లుతామని అంటారు. మరికొందరు సుందరకాండ పఠనం పాఠశాలల్లో, ఆస్పత్రిలో అమలు చేయాలని వ్యాఖ్యాస్తారు. ఇలా చేస్తూ ఆప్ పార్టీ నరేంద్రమోదీ అడుగుజాడల్లో నడుస్తోందని విమర్శించారు. నరేంద్ర మోదీ ఏదైతే చేయాలనుకుంటారో మీరు (ఆప్) అదే చేస్తారని అన్నారు. ఇలా చేస్తూ వెళ్లితే.. మీకు(ఆప్), బీజేపీకి తేడా ఏం ఉందని ఓవైసీ సూటిగా నిలదీశారు. చదవండి: ‘ఇండియా కూటమి చరిత్రక గెలుపు నమోదు చేస్తుంది’ -
శ్రీశైలం, కాణిపాక దర్శన వేళల్లో మార్పులు
శ్రీశైలం టెంపుల్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కర్ఫ్యూ వేళల్లో చేసిన మార్పులకు అనుగుణంగా శ్రీశైల మల్లన్న దర్శన వేళలను మార్పు చేశారు. సోమవారం నుంచి ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు భక్తులను దర్శనానికి అనుమతించనున్నట్లు ఆలయ ఈవో కేఎస్ రామారావు తెలిపారు. స్వామి అమ్మవార్ల ఆలయ ద్వారాలు తెరిచినప్పటి నుంచి రాత్రి మూసివేసే వరకు రోజువారీ కైంకర్యాలన్నీ యథావిధిగా కొనసాగుతాయి. వీటిని అర్చకులు ఏకాంతంగా నిర్వహించనున్నారు. 23న కాణిపాక దర్శన వేళల్లో స్వల్ప మార్పు కాణిపాకం (యాదమరి): చిత్తూరు జిల్లా కాణిపాక శ్రీవరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో ఈ నెల 23న స్వామివారి దర్శన వేళలలో స్వల్ప మార్పు చేసినట్లు ఆలయ ఈవో వెంకటేశు ఆదివారం తెలిపారు. ఆ రోజు స్వామివారి ప్రధాన ఆలయ పునఃనిర్మాణ పనులకు శంకుస్థాపన ఉండటంతో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు దర్శనాలు నిలిపివేయనున్నట్లు చెప్పారు. పూజల అనంతరం దర్శనాలు ఉంటాయని వెల్లడించారు. శ్రీభోగ శ్రీనివాసునికి ప్రత్యేక సహస్ర కలశాభిషేకం తిరుమల: శ్రీవారి ఆలయంలో భోగ శ్రీనివాసమూర్తికి ఆదివారం ప్రత్యేకంగా సహస్ర కలశాభిషేకం చేశారు. ఉదయం 6 నుంచి 8.30 గంటల నడుమ ఆలయంలోని బంగారువాకిలి చెంత ఈ కార్యక్రమాన్ని ఏకాంతంగా నిర్వహించారు. నేడు సుందరకాండ అఖండ పారాయణం కరోనా నుంచి విముక్తి కల్పించాలని శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమలలోని నాదనీరాజనం వేదికపై జూన్ 21న 15వ విడత సుందరకాండ అఖండ పారాయణం జరుగనుంది. ఉదయం 6 నుంచి 8 గంటల వరకు సుందరకాండలోని 59 నుండి 64వ సర్గ వరకు గల 174 శ్లోకాలను పారాయణం చేస్తారు. చదవండి: తిరుమల–తిరుపతి మధ్య విద్యుత్ బస్సులు -
వీనుల విందుగా సుందరకాండ
సాక్షి ప్రతినిధి, తిరుపతి: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం కర్ణాటక సీఎం బీఎస్ యడియూరప్పతో కలిసి తిరుమలలో సుందరకాండ పారాయణంలో పాల్గొన్నారు. అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు ఆలపించిన తాళ్లపాక అన్నమాచార్యులు రచించిన గీతాన్ని భక్తి శ్రద్ధలతో ఆలకించారు. నాద నీరాజనం వేదికపై సుమారు గంటకు పైగా సాగిన ఈ కార్యక్రమంలో ఆద్యంతం వారు భక్తి పారవశ్యంలో తన్మయం చెందారు. సుందరకాండలోని ముఖ్యమైన ఘట్టాల గురించి శ్రద్ధగా విన్నారు. ‘శ్రీ హనుమా.. జయ హనుమా..’ అనే సంకీర్తనను కళాకారులు ఆలపిస్తున్నప్పుడు ఇద్దరు ముఖ్యమంత్రులు సైతం పెదవి విప్పి మాట కలుపుతూ పరవశించిపోయారు. భక్తి శ్రద్ధలతో శ్రీవారి దర్శనం ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాల ముఖ్యమంత్రులు వైఎస్ జగన్మోహన్రెడ్డి, బీఎస్ యడియూరప్పలు గురువారం ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం 6.20 గంటలకు సీఎం వైఎస్ జగన్ తొలుత ఆలయం వద్దకు చేరుకున్నారు. ఆయనకు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో అనిల్ కుమార్ సింఘాల్ సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అంతలో అక్కడికి చేరుకున్న కర్ణాటక సీఎం యడియూరప్పకు అందరూ కలిసి స్వాగతం పలికారు. అనంతరం మహాద్వారం మీదుగా ఇద్దరు సీఎంలు ఆలయంలోకి ప్రవేశించి శ్రీవారిని దర్శించుకున్నారు. అంతకు ముందు ధ్వజస్తంభానికి నమస్కరించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వారు వేద పండితుల ఆశీర్వచనం అందుకున్నారు. టీటీడీ చైర్మన్, ఈవోలు వారికి తీర్థ ప్రసాదాలు, స్వామి వారి చిత్రపటాన్ని అందించారు. వైఎస్ జగన్‌ను కలిసిన డీకే శ్రీనివాస్ ► చిత్తూరు మాజీ పార్లమెంట్ సభ్యుడు డీకే ఆదికేశవులు నాయుడు, టీడీపీ మాజీ ఎమ్మెల్యే డీకే సత్యప్రభ దంపతుల కుమారుడు, ప్రముఖ పారిశ్రామిక వేత్త డీకే శ్రీనివాస్ గురువారం తిరుమలలో సీఎం వైఎస్ జగన్‌ను కలిశారు. ► తన తండ్రి టీటీడీ చైర్మన్‌గా ఉన్నప్పుడు ప్రారంభించిన ‘ఆనంద నిలయం అనంత స్వర్ణమయం’ ప్రాజెక్టును పూర్తి చేయాలని కోరానని శ్రీనివాస్ చెప్పారు. నూతన వసతి సముదాయానికి భూమి పూజ ► 2008లో టీటీడీ తిరుమలలోని కర్ణాటక చారిటీస్‌కు 7.05 ఎకరాల భూమిని 50 ఏళ్లకు లీజుకు ఇచ్చింది. ఈ స్థలంలో రూ.200 కోట్లతో నూతన వసతి సముదాయాల నిర్మాణం చేపట్టడానికి జూలైలో కర్ణాటక ప్రభుత్వం, టీటీడీ మధ్య అంగీకారం కుదిరింది. ► ఈ నేపథ్యంలో నూతనంగా నిర్మించనున్న వసతి సముదాయాలకు గురువారం కర్ణాటక సీఎం యడియూరప్ప ఏపీ సీఎం వైఎస్ జగన్‌తో కలిసి భూమి పూజ చేశారు. ఇందులో 242 వసతి గదులు, 32 సూట్ రూములు, 12 డార్మిటరీలు, కల్యాణమండపం, డైనింగ్ హాల్ నిర్మిస్తారు. పుష్కరిణిని పునరుద్ధరిస్తారు. టీటీడీ ఈ నిర్మాణాలు పూర్తి చేసి కర్ణాటక ప్రభుత్వానికి అప్పగించనుంది. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ► ఉదయం 10.40 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న సీఎం జగన్‌కు ప్రజాప్రతినిధులు, అధికారులు వీడ్కోలు పలికారు. అనంతరం ఆయన హైదరాబాద్‌కు బయల్దేరి వెళ్లారు. 11 గంటలకు యడియూరప్పకు వీడ్కోలు పలుకగా, ప్రత్యేక విమానంలో ఆయన బెంగళూరుకు బయల్దేరి వెళ్లారు. -
సరయూలో ఇద్దరు గల్లంతు
సాక్షి, హైదరాబాద్/జగ్గయ్యపేట: బియాస్ నది, డిండి ప్రాజెక్ట్ ఉదంతాల నుంచి తేరుకోక ముందే తాజాగా సరయూ నదిలో హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు వేద పండిత విద్యార్థులు గల్లంతయ్యారు. ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో జరిగే రామాయణ సుందరకాండ యజ్ఞానికి 48 మంది విద్యార్థులు వెళ్లారు. వీరు బుధవారం తెల్లవారు జామున సరయూ నదిలో స్నానానికి వెళ్లారు. అక్కడ ఫొటోలు దిగుతుండగా ఇద్దరు ప్రమాదవశాత్తు అందులో పడ్డారు. గల్లంతైన వారిలో డబీర్‌పురాకు చెందిన కిరణ్(20), మల్కాజ్‌గిరికి చెందిన చక్రపాణిశర్మ(21)లు ఉన్నారు. అల్వాల్‌కు చెందిన విశ్వనాథ శాస్త్రి ఆధ్వర్యంలో 48 మంది విద్యార్థుల బృందం సోమవారం వరంగల్ నుంచి అయోధ్యకు రైలులో వెళ్లింది. బుధవారం అయోధ్యలో రామాయణ సుందరకాండ యజ్ఞం జరగాల్సి ఉంది. ఈ యజ్ఞానికి ముందు తెల్లవారు జామున వీరంతా సరయూ నది తీరంలో స్నానాలు చేసేందుకు వెళ్లారు. స్నానాలు చేస్తూ ఫొటోలు దిగేందుకు యత్నించారు. ఈ క్రమంలోనే నదిలోకి దిగిన వారిలో కిరణ్, చక్రపాణిశర్మలు గల్లంతయ్యారు. చక్రపాణి మెదక్ జిల్లా వర్గల్ గ్రామంలో వేద పాఠశాలలో చదువు పూర్తి చేసుకుని సికింద్రాబాద్‌లోని ఎన్ఆర్ఐఐ సంస్థలో కంప్యూటర్ కోర్సు నేర్చుకుంటున్నాడు. కిరణ్ తండ్రి గతంలోనే మృతి చెందగా, ఇప్పుడు అతనూ గల్లంతు కావడంతో అతని తల్లికి రోదనే మిగిలింది. అన్నీ మేమే అయి పెంచాం... ‘తండ్రి మరణించడంతో అన్నీ మేమే అయి పెంచాం. పెళ్లి కూడా చేసేందుకు సంబంధాలు చూస్తున్నాం.. ఇంతలో ఎంత ఘోరం జరిగింది..’ అంటూ గల్లంతైన పెద్దింటి కిరణ్‌కుమార్ శర్మ(25) అక్క, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. జగ్గయ్యపేటకు చెందిన కిరణ్‌కుమార్ శర్మ తండ్రి మరణించడంతో అతని అక్క జయలక్ష్మి, బావ మార్తి ఆదిత్యకుమార్‌శర్మ, మేనమామలు పెంచి పెద్దచేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు తక్షణమే స్పందించి నదిలో మునిగిపోయిన వారి ఆచూకీ కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేయాలని విజ్ఞప్తిచేశారు. సీఎం కేసీఆర్ సంతాపం అయోధ్య వద్ద సరయూ నదిలో వేదపాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థుల మరణం పట్ల తెలంగాణ సీఎం కె. చంద్రశేఖర్‌రావు తన సంతాపాన్ని ప్రకటించారు. ఈ మేరకు సీఎం కార్యాలయం బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది.