
వెంకటేశ్, వృతి, నారా రోహిత్, సంతోష్, రాకేశ్
‘‘సుందరకాండ’ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తున్నందుకు సంతోషంగా ఉంది. సత్య క్యారెక్టర్‌తో నాకు మంచి పేరు వచ్చింది. వెంకీ రాసిన డైలాగ్స్ గురించి ప్రత్యేకంగా చెబుతున్నారు. ఇంకా చూడనివాళ్ళు, థియేటర్స్‌కి వెళ్లి, మా సినిమా చూడండి’’ అని నారా రోహిత్ అన్నారు. నారా రోహిత్ హీరోగా, వృతి వాఘాని, శ్రీదేవి విజయ్ కుమార్ హీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం ‘సుందరకాండ’.
వెంకటేశ్ నిమ్మలపూడి దర్శకత్వంలో సంతోష్ చిన్న పొల్ల, గౌతమ్ రెడ్డి, రాకేశ్ మహంకాళి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 27న విడుదలైంది. ఈ సందర్భంగా శుక్రవారం నిర్వహించిన థ్యాంక్స్ మీట్‌లో వెంకటేశ్ నిమ్మలపూడి మాట్లాడుతూ– ‘‘నా రైటింగ్‌కు మంచి ప్రశంసలు వస్తున్నందుకు సంతోషంగా ఉంది’’ అన్నారు.
‘‘దిల్’ రాజుగారి బేనర్ నుంచి వచ్చినట్టు మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ తీశారని చెబుతుంటే ఆనందంగా ఉంది’’ అని చె ప్పారు నిర్మాత సంతోష్. ‘‘ఈ సినిమా విషయంలో మేం ఎంత ఎగ్జయిట్ అయ్యామో, ఆడియన్స్ కూడా ఈ సినిమా చూసి అంతే ఎగ్జయిట్ కావడం సంతోషాన్నిస్తోంది’’ అని పేర్కొన్నారు రాకేశ్.