
నారా రోహిత్ హీరోగా నటించిన ‘సుందరకాండ’ చిత్రం ఆగస్టు 27న రిలీజ్ కానుంది. వెంకటేశ్ నిమ్మలపూడి దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రంలో వృతి వాఘాని, శ్రీదేవి విజయ్‌కుమార్ హీరోయిన్లు. సంతోష్ చిన్నపోళ్ల, గౌతమ్ రెడ్డి, రాకేశ్ మహంకాళి నిర్మించారు.
జూలై 25న నారా రోహిత్ బర్త్‌డే సందర్భంగా ‘సుందరకాండ’ని ఆగస్టు 27న వినాయక చవితి సందర్భంగా విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది. ‘‘ఈ చిత్రంలో హీరో జీవితంలోని వివిధ దశల్లోని రెండు ప్రేమకథలను చూపిస్తున్నాం. శ్రీదేవితో మొదటి ప్రేమ, వృతి వాఘానితో కలిసి రెండో ప్రేమకథని ప్రేక్షకులు చూస్తారు’’ అని యూనిట్ పేర్కొంది.