ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే? | Sundarakanda Movie OTT Streaming Details Latest | Sakshi
Sakshi News home page

Sundarakanda OTT: తల్లిని కూతురిని ప్రేమించే హీరో.. ఓటీటీ అధికారిక ప్రకటన

Sep 17 2025 5:37 PM | Updated on Sep 17 2025 6:16 PM

Sundarakanda Movie OTT Streaming Details Latest

లేటెస్ట్ తెలుగు సినిమా నెలలోపే ఓటీటీలోకి వచ్చేందుకు సిద్దమైంది. నారా రోహిత్, శ్రీదేవి విజయ్ కుమార్, వర్తి వాఘని హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం.. మొన్నమొన్ననే థియేటర్లలోకి వచ్చింది. ఇప్పుడు డిజిటల్ ప్రేక్షకుల్ని అలరించేందుకు రెడీ అయిపోయింది. ఈ క్రమంలోనే అధికారికంగానూ ప్రకటించారు. ఇంతకీ ఈ సినిమా సంగతేంటి? ఏ ఓటీటీలోకి రానుంది?

గత కొన్నేళ్లుగా నటనకు దూరంగా ఉన్న నారా రోహిత్.. ఈ ఏడాది 'భైరవం' మూవీతో వచ్చాడు. కానీ ఫలితం డిసప్పాయింట్ చేసింది. గత నెల 27న 'సుందరకాండ' అనే సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించాడు. కామెడీ వర్కౌట్ అయింది అనే టాక్ వచ్చింది గానీ దీన్ని కూడా ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు ఈ చిత్రాన్ని ఈనెల 23 నుంచి హాట్‪‌స్టార్‌లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీలో అందుబాటులోకి రానుంది.

(ఇదీ చదవండి: ఎట్టకేలకు ఓటీటీలోకి 'జూనియర్' సినిమా)

'సుందరకాండ' విషయానికొస్తే.. సిద్ధార్థ్ (నారా రోహిత్) 30 ఏళ్లు దాటిపోయి చాన్నాళ్లయినా సరే పెళ్లి చేసుకోడు. స్కూల్‌లో చదువుకునేటప్పుడు తన సీనియర్ వైష్ణవి(శ్రీదేవి)ని ప్రేమిస్తాడు. ఆమెలోని కొన్ని లక్షణాలు ఇతడికి నచ్చుతాయి. పెద్దయిన తర్వాత అలాంటి లక్షణాలున్న అమ్మాయినే పెళ్లి చేసుకుంటానని తనకు తానే రూల్ పెట్టుకుంటాడు. సంబంధాలు వస్తుంటాయి, అమ్మాయిల్ని చూస్తుంటాడు కానీ అందరినీ రిజెక్ట్ చేస్తుంటాడు.

ఓసారి ఎయిర్‌పోర్ట్‌లో ఐరా(వృతి వాఘని) అనే అమ్మాయిలో తను అనుకున్న క్వాలిటీస్ ఉన్నాయని సిద్దార్థ్ ఆమె వెంటపడతాడు. తనని ప్రేమించేలా చేస్తాడు. మరి ఈ ప్రేమకథ సుఖాంతమైందా? సిద్ధార్థ్ మళ్లీ వైష్ణవిని ఎందుకు కలవాల్సి వచ్చిందనేది మిగతా స్టోరీ. అయితే ఇందులో హీరో.. తల్లికూతురిని ప్రేమించడం అనే కాన్సెప్ట్ కాస్త విడ్డూరంగా ఉంటుంది. సత్య కామెడీ వర్కౌట్ అయినప్పటికీ.. ఈ కాన్సెప్ట్ ఓకే అనుకుంటేనే దీన్ని చూడండి.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాలు ఇవే)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement