
‘‘ఓ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం అంత సులభం కాదు. దాని వెనుక ఎంతో మంది శ్రమ ఉంటుంది. ఇండస్ట్రీలో పనిచేసే వారిని సినిమా వాళ్లులే అని చాలామంది సులభంగా అనేస్తారు. దాని వెనుక ఎన్నో త్యాగాలు, మరెన్నో ఒడుదొడుకులు ఉంటాయి. వాటిని దాటుకొని రాగలిగితేనే ఇక్కడ ఉండగలం’’ అని హీరో మంచు మనోజ్ చెప్పారు. నారా రోహిత్ హీరోగా, వృతి వాఘాని, శ్రీదేవి విజయ్ కుమార్ హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘సుందరకాండ’.
వెంకటేష్ నిమ్మలపూడి దర్శకత్వంలో సంతోష్ చిన్నపొల్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా హాజరైన మంచు మనోజ్ మాట్లాడుతూ–‘‘సుందర కాండ’ చిత్రానికి ప్రేక్షకులు గొప్ప విజయం అందించాలి’’ అని కోరారు. ‘‘ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో కలిసి మా సినిమా చూసి, మమ్మల్ని ఆశీర్వదించండి’’ అని నారా రోహిత్ పేర్కొన్నారు. ‘‘మా మూవీ చూసి ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాం’’ అని సంతోష్ చిన్నపొల్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి తెలిపారు.