
‘‘సుందరకాండ’ చాలా క్లీన్ ఫిలిం. 30 ఏళ్లు దాటినా కూడా కావాల్సిన అర్హతలున్న అమ్మాయి కోసం హీరో వెతకడం అనేది చాలా ఆసక్తిగా ఉంటుంది. నా క్యారెక్టర్‌లో కొత్త ఎగ్జిట్ ఉంది.. ఈ పాత్రని చాలా ఎంజాయ్ చేశాను.. నేటి తరానికి ఇది చాలా కొత్త కథ. అన్ని వర్గాల వారికి కనెక్ట్ అవుతుంది’’ అని నారా రోహిత్ చెప్పారు.
వెంకటేష్ నిమ్మలపూడి దర్శకత్వంలో నారా రోహిత్ హీరోగా, వృతి వాఘాని, శ్రీదేవి విజయ్ కుమార్ హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘సుందరకాండ’. సందీప్ పిక్చర్ ఫ్యాలెస్‌పై సంతోష్ చిన్న పోల్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 27న విడుదల కానుంది.
ఈ సందర్భంగా నారా రోహిత్ విలేకరులతో మాట్లాడుతూ– ‘‘2022లోనే ‘సుందరకాండ’ స్క్రిప్ట్ వర్క్ ఆరంభించాం. వెంకటేష్ అద్భుతమైన కథ రాశాడు. ఈ సినిమా నాప్రోడక్షన్‌లోనే స్టార్ట్ చేశాను. అయితే నా కజిన్ సంతోష్, గౌతమ్, రాకేష్.. ఈ కథ నచ్చి నిర్మాణంలో భాగమయ్యారు. లియాన్ జేమ్స్ మంచి పాటలు, నేపథ్య సంగీతం ఇచ్చారు’’ అని తెలిపారు.