
మాస్టర్ మహేంద్రన్, బ్రహ్మాజీ, శత్రు, చైత్ర ప్రధాన పాత్రల్లో నటించిన క్రైమ్ ఇన్వెస్టిగేషన్ అండ్ థ్రిల్లర్ సినిమా ఫిల్మ్ ‘కర్మణ్యే వాధికారస్తే’. అమర్ దీప్ చల్లపల్లి దర్శకత్వంలో డీఎస్‌ఎస్ దుర్గా ప్రసాద్ నిర్మించారు. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో హీరో మాస్టర్ మహేంద్ర మాట్లాడుతూ– ‘‘నాకు సినిమా తప్ప ఏమీ తెలియదు. కథపై ఉన్న నమ్మకంతో నిర్మాతగారు ఈ సినిమాను ముందుకు తీసుకెళ్తున్నారు.
బ్రహ్మాజీగారితో స్క్రీన్ షేర్ చేసుకోవడం సంతోషంగా ఉంది’’ అని తెలిపారు. ‘‘శత్రువులు ఎక్కడో ఉండరు. మన చుట్టూనే మన ఇంట్లోనే ఉంటారనే కాన్సెప్ట్‌తో ఈ సినిమాను రూపొందించారు. సినిమాలో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. క్లైమాక్స్‌ను కొత్తగా డిజైన్ చేశారు’’ అని తెలిపారు బ్రహ్మాజీ. ‘‘ఈ సినిమా చేయడం కోసం చాలా కష్టపడ్డాం’’ అన్నారు అమర్‌దీప్. ‘‘చిన్న సినిమా అని కాకుండా మంచి కంటెంట్ ఉన్న సినిమాగా ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించాలి’’ అని పేర్కొన్నారు నిర్మాత దుర్గా ప్రసాద్. ఈ చిత్రంలో నటించిన బెనర్జీ, అతిథిగా పాల్గొన్న సీనియర్ జర్నలిస్ట్ ప్రభు, నిర్మాత ‘మధుర’ శ్రీధర్ మాట్లాడారు.