
సన్నీ కునాల్ హీరోగా, దేవిక సాహూ, ఆశ హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘రోహిణి’. సంగ కుమార్ దర్శకత్వంలో కేవీ నరసింహ రాజు సమర్పణలో కుశాల్ రాజు నిర్మించారు. ఆనంద్ సంగీతం అందించిన ఈ మూవీ ఆడియో లాంచ్, ట్రైలర్ విడుదల వేడుకని హైదరాబాద్‌లో నిర్వహించారు. సంగ కుమార్ మాట్లాడుతూ–‘‘యూనిట్‌లోని ప్రతి ఒక్కరి కృషి వల్లే మా సినిమా త్వరగా పూర్తయింది.
రాజేంద్ర రాజు కాంచనపల్లి అందించిన సహకారం మా సినిమాకు బలం’’ అని తెలి పారు. ‘‘త్వరలోనే విడుదల కానున్న మా సినిమాని ఆదరించాలి’’ అన్నారు కుశాల్ రాజు. ‘‘ప్రేక్షకులకు నచ్చే సస్పెన్స్, థ్రిల్, రొమాన్స్ వంటి అంశాలు మా చిత్రంలో చాలా ఉన్నాయి’’ అన్నారు సన్నీ కునాల్. ‘‘దాసరి వెంకటరమణగారి పాటలు వినసొంపుగా, కనువిందుగా ఉంటాయి’’ అని సమర్పకుడు కేవీ నరసింహ రాజు తెలి పారు.