
విజయవాడ: ఏపీలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ స్పష్టం చేసింది. ఏపీలోని పలు జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరికలు జారీ చేసింది. రాగల కొన్ని గంటల్లో శ్రీకాకుళం, విజయనగరం, మన్యం అల్యూరి, విశాఖ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించారు.
ఈ మేరకు శ్రీకాకుళం, విజయనగరం, మన్యం అల్యూరి, విశాఖ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. అనకాపల్లి,కాకినాడ జిల్లాల్లో పలుచోట్ల పిడుగులతో కూడిన మోస్తారు వర్షాలు పడతాయని విపత్తుల నిర్వహణ సంస్థ.ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. ఈ జిల్లాలకు అరెంజ్ అలెర్ట్ జారీ చేశారు.
ఎన్టీఆర్, ఏలూరు, తిరుపతి, నెల్లూరు, నంద్యాల జిల్లాల్లో పలుచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేశారు. ఇక 40-50కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, హోర్డింగ్స్, చెట్ల కింద, శిథిలావస్థలో ఉన్న భవనాలు దగ్గర నిలబడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.