డోర్నకల్: మోంథా తుపాను ప్రభావంతో తెలంగాణలోని పలు చోట్ల ఎడతెరిపిలేని భారీ వర్షాలు కురుస్తున్నాయి.
భారీ వర్షాల కారణంగా రవాణా వ్యవస్థ ఎక్కడికక్కడే నిలిచిపోయింది. తాజాగా మహబూబాబాద్ జిల్లాలో కురుస్తున్న వర్షం కారణంగా రైలు పట్టాలపైకి వరద నీరు చేరింది. దీంతో, డోర్నకల్ రైల్వేస్టేషన్‌లో పట్టాల పైనుంచి వరదనీరు ప్రవహిస్తోంది.


