ఫిలిప్పీన్స్‌ను ‘కల్మెగి’తుపాను హడలె త్తిస్తోంది. దేశ మధ్య ప్రాంతంలో సెబు, ఈస్టర్న్ సమర్, గుయిమరస్, బొహొల్, పలవన్ ప్రావిన్స్ లపై ఇది తీవ్ర ప్రభావం చూపుతోంది. కనీసం 40 మంది చనిపోయినట్లు అధికారులు మంగళవారం సాయంత్రం తెలిపారు.
వరదల కారణంగా చెత్తాచెదారం రోడ్లపైకి భారీగా చేరడంతో ముందుకు కదలడానికి వీల్లేని పరిస్థితులున్నాయని అధికారులు అంటున్నారు.
వరద నీళ్లలో కార్లు తేలియాడుతున్నాయన్నారు.


