విశాఖ: ఏపీకి తుపాన్ రూపంలో మరో ముప్పు పొంచి ఉంది. ఇప్పటికే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా అతాలకుతాలమైన ఏపీలో మరో వారం రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
ఈనెల 27వ తేదీన బంగాళాఖాతంలో ఏర్పడబోయే తుపాను ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం.. రేపటికి(శనివారం, అక్టోబర్ 25వ తేదీ నాటికి వాయుగుండంగా బలబడే అవకాశం ఉందని తెలిపిది.
ఆపై తుపానుగా మారే అవకాశం ఉందని, దీని ప్రభావంతో ఏపీలో వారం రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది. ఈరోజు(శుక్రవారం), రాయలసీమ, దక్షిణ కోస్తాలో బారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్ల తెలిపింది. దాంతో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హచ్చరించింది.


